నానోసైన్స్ మరియు టెక్నాలజీ పైన శాస్త్రీయ సదస్సు
నానోసైన్స్ మరియు టెక్నాలజీ పైన శాస్త్రీయ సదస్సు
తిరుపతి, ఆగష్టు -25, 2009: తితిదే ఆధ్వర్యంలో ఈరోజు మధ్యాహ్నం మహతి ఆడిటోరియంలో నానోసైన్స్ మరియు టెక్నాలజీ పైన శాస్త్రీయ సదస్సు జరిగినది. ఈ సదస్సులో భారత ప్రధానమంత్రి గారికి శాస్త్రీయ సలహాదారుగా వ్యవహరిస్తున్న పద్మభూషణ్ ఆచార్య సి.ఎన్.ఆర్. రావు నానో పదార్థాలు వాటి ధర్మాలు, ఉపయోగాలపైన అద్భుతమైన సందేశాన్ని అందించారు. మనకు వస్తున్న పారిశ్రామిక, వైద్య, అంతరిక్ష మరియు ఔషధఉత్పత్తుల సూక్ష్మాతి సూక్ష్మమైన (వెంట్రుకలతో ఒక లక్షవ వంతు పరిమాణం కలిగిన) పరమాణువుల సమూహం యొక్క ఉపయోగాలను విశ్లేషించారు. నానో విప్లవం 21వ శతాబ్ధంనకు నాందిగా పేర్కొన్నారు. ఉదాహరణకు ఒక చేతిగడియారము 1000 సి.డి ల సమాచారాన్ని నిక్షిప్తం చేయగలదని తెలిపారు. ఇదే సదస్సులో ఆచార్య ఫ్రొఫసర్ అజయ్‌కుమార్ సూడ్ (ఇండియన్ ఇన్సిట్యూట్ ఆఫ్ సైన్స్, బెంగళూరు) కర్బన రసాయన అద్భుత ప్రపంచాన్ని గురించి వివరించారు. (కర్బన్ వండర్ వరల్డ్) ఈసదస్సులో దాదాపు 2000 మంది విద్యార్థినీ, విద్యార్థులు వివిధ తితిదే డిగ్రీ కాలేజీలు, తిరుపతిలో వివిధ కళాశాలలు, యూనివర్శిటీ విద్యార్థులు, ఫ్రొఫెసర్స్ పాల్గొన్నారు.
ఈ సదస్సులో ఫ్రొఫెసర్. డి.నారాయణరావు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ఎన్.ఎ.ఆర్.ఎల్, గాదంకి, సిమ్స్ డైరెక్టర్ డా. సుబ్రమణ్యం, వేదిక్ యూనివర్శిటీ వైస్‌ఛాన్స్‌లర్ ఆచార్య సుదర్శన శర్మ, ఎన్. నాగేంద్ర సాయి, ఎస్.జి.ఎస్. ఆర్ట్స్ కాలేజీ, ఫ్రిన్సిఫల్ మొదలగువారు ఈసదస్సులో పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.