MESMERIZING DASA SANKEERTANA AT NARAYANAGIRI GARDENS _ నారాయ‌ణ‌గిరి ఉద్యాన‌వ‌నాల్లో మైమ‌ర‌పించిన దాసప‌దాల‌ సంకీర్త‌నాగానం

Tirumala, 09 February 2024: Sri Purandhara Dasa Sankeertana Gosti held at Narayanagiri Gardens in Tirumala as part of Sri Purandhara Dasa Aradhana Mahotsavams which mesmerized the devotees on Friday night. 

Earlier Sri Malayappa Swamy along with His consorts arrived at Narayanagiri Gardens and Sankeertans were held in the presence of Palimaru Mutt pontiffs.

Thereafter popular Sankeertans of Purandara Dasa were rendered by artists of Dasa Sahitya Project. 

Dasa Sahitya Project. Special Officer Sri Ananda Theerthacharyulu and over 3500 bhajan Mandalis members were present. 

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

నారాయ‌ణ‌గిరి ఉద్యాన‌వ‌నాల్లో మైమ‌ర‌పించిన దాసప‌దాల‌ సంకీర్త‌నాగానం

తిరుమల, 2024 ఫిబ్ర‌వ‌రి 09: తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనాలు శుక్ర‌వారం సాయంత్రం శ్రీ పురందరదాసులవారి కీర్తనలతో మారుమోగాయి. శ్రీ పురందరదాసులవారి ఆరాధన మహోత్సవాలు రెండో రోజుకు చేరుకున్నాయి. ముందుగా శ్రీవారు ఉభయదేవేరులతో కలిసి నారాయణగిరి ఉద్యానవనాలకు వేంచేపు చేశారు. ఈ సంద‌ర్భంగా చల్లటి సాయంత్రం వేళ నిర్వ‌హించిన ఊంజ‌ల్‌సేవ‌లో దాస సంకీర్తనల గానం భక్తులను మైమరపింపచేసింది. ఈ కార్యక్రమంలో ఉడిపి పా‌లిమారు మ‌ఠాధిప‌తి శ్రీ‌శ్రీ‌శ్రీ విద్యాధీశ‌తీర్థ స్వామీజీ, ఉత్త‌రాధికారి శ్రీ‌శ్రీ‌శ్రీ విద్యారాజేశ్వ‌తీర్థ స్వామిజీ పాల్గొన్నారు.

టీటీడీ దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమంలో దాస భక్తులు సామూహికంగా పురందరదాస కృతులను ఆలపించారు. ఇందులో ” వండితే గురుపు రందర దాసరే…., “బందాలో మహాలక్ష్మి…”, అడిదనో రంగ…, బంధ నేనే రంగా…, శ్రీనివాస నీనే బలిసో…, తిరుపతి వెంకటరమణ….™️ తదితర కీర్తనలు భక్తి సాగరంలో ముంచెత్తాయి.

టిటిడి దాససాహిత్య ప్రాజెక్టు ప్ర‌త్యేకాధికారి శ్రీ ఆనందతీర్థాచార్యులు, ఇతర అధికారులు, 3,500 మందికి పైగా భజన మండళ్ల సభ్యులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.