CHATRA STHAPANOTSAVAM AT SRIVARI PADALU _ నారాయణగిరి శ్రీవారి పాదాల చెంత ఛత్రస్థాపనోత్సవం
Tirumala, 31 Jul. 20: TTD organised annual Chatra Sthapanotsavam at the Srivari Padalu at Narayanagiri on Friday.
As part of the event, TTD archakas installed a specially decorated umbrella at Srivari padalu after traditional puja.
Legends say that Lord Venkateswara has stepped first atop Narayanagiri where every year on Sravana Sudha Dwadasi Chatra Sthapanotsavam event is conducted by TTD.
Legends also say that the umbrella is installed with a belief to seek relief from heavy winds lashing the Srivari temple structures downstream.
Srivari Temple Archakas and officials participated.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
నారాయణగిరి శ్రీవారి పాదాల చెంత ఛత్రస్థాపనోత్సవం
తిరుమల, 2020 జూలై 31: తిరుమలలోని నారాయణగిరి శ్రీవారి పాదాల చెంత శుక్రవారం ఛత్రస్థాపనోత్సవం జరిగింది. ఈ సందర్భంగా శ్రీవారి పాదాల వద్ద టిటిడి అర్చక బృందం ప్రత్యేకంగా అలంకరించిన గొడుగును ప్రతిష్టించారు. ముందుగా శ్రీవారి పాదాలకు తిరుమంజనం చేపట్టారు. అలంకారం, పూజలు నిర్వహించి నైవేద్యం సమర్పించారు. వేదపారాయణదారులు ప్రబంధ శాత్తుమొర నిర్వహించారు.
తిరుమల ఏడుకొండల్లో అత్యంత ఎత్తయిన నారాయణగిరి శిఖరంపై కలియుగంలో శ్రీవేంకటేశ్వరస్వామివారు మొదటగా కాలు మోపినట్టు పురాణాల ద్వారా తెలుస్తోంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రతి ఏటా శ్రావణ శుద్ధ ద్వాదశి నాడు ఛత్రస్థాపనోత్సవం నిర్వహిస్తారు.
ఈ ఉత్సవానికి మరో నమ్మకం కూడా ఉంది. సాధారణంగా ఈ కాలంలో గాలులు ఎక్కువగా వీస్తాయి. నారాయణగిరి శిఖరం ఎక్కువ ఎత్తులో ఉండడంతో మరింత ఎక్కువగా గాలులు వీస్తాయి. ఈ గాలుల నుంచి ఉపశమనం కల్పించాలని వాయుదేవుని ప్రార్థిస్తూ ఇక్కడ గొడుగును ప్రతిష్టిస్తారు.
ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ అర్చకులు, అధికారులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.