TTD PUBLICATIONS FOR COMMON PUBLIC-FINANCE MINISTER OF AP _ నేటి తరానికి సులువుగా అర్థమయ్యేలా టీటీడీ ప్రచురణలు – మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ రెడ్డి 

TIRUPATI, 26 FEBRUARY 2023: The TTD publications should be understandable even to a common man and the present generation so that the motto of Hindu Sanatana Dharma shall be taken forward in a wide spread manner among youth, said the Honourable Finance Minister of AP Sri Buggana Rajendranath Reddy.

A meeting was held at the TTD Publications Office in Tirupati on Sunday along with the JEO for Health and Education Smt Sada Bhargavi and other scholars.

Speaking on the occasion, the Minister lauded the efforts of TTD in bringing out varieties of spiritual books in different languages and said TTD alone can do such a great work. 

“These books by eminent scholars need to be simplified to reach a common man and today’s youth so that we can take forward Dharma Prachara with more focus”, he added.

He also suggested to adopt advanced technology methods in publications on par with private publishers. “The publications of TTD are the best source of Hindu Dharma Prachara and we should utilize it in the best possible manner”, he reiterated.

JEO informed the Minister that many renowned scholars have voluntarily come forward to contribute their knowledge in bringing out publications. “So far 1200 publications are made available on TTD website also. We will keep our publications at Airport as per the advice of the Honourable Minister”, she maintained.

Eminent scholars, Sri Lakshmi Narayana, Dr Sudha, Sri Nagaraju, Sri Satyamurthy, Sri Subrahmanya Sharma, Annamacharya Project Director Sri Vibhishana Sharma, Sapthagiri Chief Editor Sri Radha Ramana, Editor Sri Chokkalingam, Special Officer Publications Sri Ramaraju, Saptagiri sub-editor Sri Narasimhacharya were also present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

నేటి తరానికి సులువుగా అర్థమయ్యేలా టీటీడీ ప్రచురణలు – మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ రెడ్డి

తిరుపతి 26 ఫిబ్రవరి 2023: సనాతన హిందూధర్మం, భారతీయ సంస్కృతికి సంబంధించి టీటీడీ ప్రచురిస్తున్న పుస్తకాలు నేటితరం వారికి కూడా సులువుగా అర్థమయ్యేలా ఉండాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీ బుగ్గన రాజేంద్ర నాథరెడ్డి సూచించారు.

టీటీడీ ప్రచురణల విభాగం కార్యాలయంలో ఆదివారం మధ్యాహ్నం ఆయన జేఈవో శ్రీమతి సదా భార్గవి తో పాటు పలువురు ప్రముఖ సాహితీవేత్తలు,పండితులతో సమావేశం నిర్వహించారు.

వివిధ భాషల్లో టీటీడీ ప్రచురిస్తున్న పురాణాలు, గ్రంథాలు, హిందూ ధర్మ ప్రచారానికి ఎంతో ఉపయోగపడుతున్నాయని మంత్రి అభినందించారు. ఇంతటి గొప్ప పని టీటీడీ మాత్రమే చేయగలుగుతుందని అన్నారు. ఇలాంటి గ్రంథాలలోని భాషను సరళీకరించి ప్రతి ఒక్కరికీ సులువుగా అర్థమయ్యేలా ప్రచురించాలని కోరారు. దీనివల్ల మరింత ఎక్కువ ప్రయోజనం లభిస్తుందన్నారు. డిజైన్, కంటెంట్ ప్రజెంటేషన్ , అర్థ,తాత్పర్యాలు చెడిపోకుండా విషయాన్ని వాడుక భాషలో చెప్పడం వల్ల ప్రైవేట్ ప్రచురణ కర్తలకు పోటీగా టీటీడీ ప్రచురణలు విశేష ఆదరణ పొందుతాయని శ్రీ రాజేంద్ర నాథ రెడ్డి సూచించారు.

ముద్రణలో కూడా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకోవాలని ఆయన చెప్పారు. అనేక మంది ప్రముఖ సాహితీ వేత్తలు, పండితులు ఈ అంశంలో టీటీడీకి స్వచ్ఛందంగా సహకరించడానికి ముందుకు వచ్చారని మంత్రి తెలిపారు. టీటీడీకి వారి సలహాలు, సూచనలు ఇస్తారని, వీటిలో ఆచరణ సాధ్యమైనవి అమలు చేసి టీటీడీ ఆధ్వర్యంలో ప్రపంచ వ్యాప్తంగా హిందూ ధర్మాన్ని ప్రచారం చేయడమే ఈ సమావేశం ముఖ్య ఉద్దేశమ న్నారు.

ఈ సందర్భంగా పలువురు పండితులు సాహితీవేత్తలు, అధికారులు సుదీర్ఘంగా చర్చించారు. జేఈవో శ్రీమతి సదా భార్గవి మాట్లాడుతూ, టీటీడీ ప్రచురణలను మరింతగా జనబాహుళ్యంలోకి, ముఖ్యంగా యువతకు చేరువ చేయడానికి అనేక చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. శ్రీవారి కళ్యాణోత్సవాలు, వైభవోత్సవాలు జరిగే ప్రాంగణాల్లో స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నామని, వర్క్ షాప్ లు కూడా నిర్వహిస్తామని తెలిపారు. మంత్రి శ్రీ రాజేంద్రనాథ రెడ్డి సూచించిన విధంగా విమానాశ్రయాల్లోని స్టాల్స్ లో టీటీడీ ప్రచురణలు అందుబాటులో ఉంచే ఆలోచన చేస్తామని చెప్పారు. 1200 దాకా పుస్తకాలు వెబ్సైట్ లో అందుబాటులో ఉంచామని, ఆడియో బుక్స్ కూడా అందుబాటులోకి తీసుకుని వచ్చే ప్రయత్నం జరుగుతోందన్నారు.

ప్రముఖ సాహితీవేత్తలు, పండితులు శ్రీ లక్ష్మీనారాయణ, డాక్టర్ సుధ, శ్రీపాతూరి నాగరాజు, శ్రీ సత్యమూర్తి, శ్రీ సుబ్రమణ్య శర్మ, అన్నమాచార్య ప్రాజెక్టు సంచాలకులు శ్రీ విభీషణ శర్మ, సప్తగిరి పత్రిక ప్రధాన సంపాదకులు శ్రీ రాధా రమణ, సంపాదకులు శ్రీ చొక్కలింగం, ప్రచురణల విభాగం ప్రత్యేకాధికారి శ్రీ రామరాజు, సప్తగిరి ఉపసంపాదకులు శ్రీ నరసింహాచార్య పాల్గొన్నారు.

టీటీడీ వివిధ భాషల్లో ప్రచురించిన గ్రంధాలు, పుస్తకాలను ఈ సందర్భంగా వీరు పరిశీలించారు.

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది