నేత్రపర్వంగా శ్రీ గోవిందరాజస్వామివారి తెప్పోత్సవాలు ప్రారంభం

నేత్రపర్వంగా శ్రీ గోవిందరాజస్వామివారి తెప్పోత్సవాలు ప్రారంభం

తిరుపతి, ఫిబ్రవరి 19, 2013: తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి తెప్పోత్సవాలు మంగళవారం సాయంత్రం ఘనంగా ప్రారంభం కానున్నాయి. స్వామి వారి పుష్కరిణిలో ఏడు రోజుల పాటు సాయంత్రం 6.30 గంటల నుండి 8.00 గంటల వరకు స్వామివారు తెప్పపై భక్తులకు కనువిందు చేయనున్నారు.
 
ఈ సందర్భంగా ఉదయం నుండి ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. సాయంత్రం 5.30 గంటలకు శ్రీకోదండరామస్వామివారు ఆలయ వాహన మండపానికి వేంచేశారు. సాయంత్రం 6.30 గంటలకు తెప్పోత్సవం వైభవంగా ప్రారంభం కానుంది. మొదటిరోజు స్వామివారు ఐదుచుట్లు తెప్పలపై విహరించి భక్తులకు దర్శనమివ్వనున్నారు.
   
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.