KARTHIKA PARVA DEEPOTSAVAM ON NOVEMBER 29 _ నవంబరు 29న కార్తీక పర్వదీపోత్సవం
నవంబరు 29న కార్తీక పర్వదీపోత్సవం
తిరుమల, 2020 నవంబరు 27: తిరుమల శ్రీవారి ఆలయంలో నవంబరు 29వ తేదీన సాలకట్ల కార్తీక పర్వదీపోత్సవం జరుగనుంది. శ్రీవారికి సాయంకాల కైంకర్యాలు, నివేదనలు పూర్తి అయిన తరువాత ఈ దీపోత్సవం నిర్వహిస్తారు.
ఈ సందర్భంగా సాయంత్రం 5 నుండి 8 గంటల వరకు నేతి వత్తులతో దీపాలను వెలిగించి ఛత్రచామర, మంగళవాయిద్యాలతో ఊరేగింపుగా విమాన ప్రదక్షిణం చేస్తూ, ఆనందనిలయంలో శ్రీవారికి హారతి ఇస్తారు. ఆతర్వాత వరుసగా గర్భాలయంలో అఖండం, కులశేఖరపడి, రాములవారిమేడ, ద్వారపాలకులు, గరుడాళ్వారు, వరదరాజస్వామి సన్నిధి, వకుళమాత, బంగారుబావి, కల్యాణమండపం, సభఅర, తాళ్లపాక అర, భాష్యకారుల సన్నిధి, యోగనరసింహస్వామి, విష్వక్సేనులు, చందనం అర, పరిమళం అర, వెండివాకిలి, ధ్వజస్తంభం, బలిపీఠం, క్షేత్రపాలకుల సన్నిధి, తిరుమలరాయ మండపం, పూలబావి, రంగనాయక మండపం, మహాద్వారం, బేడి ఆంజనేయస్వామి, శ్రీవరాహస్వామి ఆలయం, స్వామి పుష్కరిణి వద్ద దీపాలను ఏర్పాటు చేస్తారు. ఈ సందర్భంగా శ్రీవారి ఆలయంలో సహస్రదీపాలంకరణ సేవను టిటిడి రద్దు చేసింది.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.
Tirumala, 27 Nov. 20: The annual Karthika Parva Deepotsavam, the festival of lights will be observed in Tirumala temple on November 29.
After the evening Kainkaryams and Naivedyams, the ghee lit lamps in Mukullu will be placed at different places in the temple. This event takes place between 5 pm and 8 pm.
TTD has cancelled Sahasra Deepalankara Seva in view of this festival on that day.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI