పదవీ విరమణ చేయు ఉద్యోగులకు వి.ఐ.పి బ్రేక్‌లో శ్రీవారి దర్శనభాగ్యం

పదవీ విరమణ చేయు ఉద్యోగులకు వి.ఐ.పి బ్రేక్‌లో శ్రీవారి దర్శనభాగ్యం

 తిరుపతి, డిశెంబర్‌-01, 2009: తిరుమల తిరుపతి దేవస్థానమునందు భక్తిభావముతో శ్రీవారిని సేవిస్తూ నిరంతరం భక్తులకు సేవలనందిస్తూ పదవీవిరమణ (రిటైర్మెంట్‌) చేయు ఉద్యోగులకు ఇకమీదట తిరుమల ఆలయమునందు వి.ఐ.పి. దర్శన విరామ సమయమునందు శ్రీవారి దర్శనభాగ్యమును కల్పించి సర్కారు హారతి ఇప్పించి ఆలయములోని శ్రీరంగనాయక మండపమునందు తితిదే వేదపండితుల ద్వారా ఆశీర్వాదము ఇప్పించుటకు సంకల్పించడమైనది. అదేసమయంలో 8 గ్రాముల బంగారు డాలరు, స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రమైన లడ్డూ, వడ, ప్రసాదము, వస్త్ర బహూకరణ కూడా శ్రీవారి రంగనాయకుల మండపము నందు అధికారుల ద్వారా ఇప్పించుటకు తితిదే నిర్ణయించినది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.