LAKSHA KUMKUMARCHANA HELD IN SRI PAT _ పద్మావతి అమ్మవారి ఆలయంలో శాస్త్రోక్తంగా లక్షకుంకుమార్చన
TIRUPATI, 19 NOVEMBER 2022: Laksha Kumkumarchana was held with religious fervour in Sri Padmavathi Ammavari Temple in Tirupati on Saturday.
After awakening the presiding deity with Suprabhatam, Sahasranamarchana was performed. Later the Utsava murthy of Goddess Padmavathi Devi was brought to Sri Krishna Mukha Mandapam.
The temple archakas performed Laksha Kumkumarchana between 8am and 12noon in front of the processional deity.
Kumkuma (vermilion) has got great significance in Hindu Sanatana Dharma, as married women place Sindhoor on their foreheads seeking the well-being and longevity of their husbands.
The event is conducted ahead of the Navahnika Karthika Brahmotsavams where the devotees participated with devotion.
Spouses of TTD mandarins, JEO Smt Sada Bhargavi, DyEO Sri Lokanatham, AEO Sri Prabhakar Reddy and others were present.
శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో శాస్త్రోక్తంగా లక్షకుంకుమార్చన
తిరుపతి, 2022 నవంబరు 19: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో శనివారం శాస్త్రోక్తంగా లక్ష కుంకుమార్చన నిర్వహించారు. నవంబరు 20 నుండి 28వ తేదీ వరకు జరుగనున్న వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఈ కార్యక్రమం జరిపారు. శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేసింది.
ఆలయంలోని శ్రీకృష్ణ ముఖ మండపంలో శ్రీ పద్మావతి అమ్మవారిని ఆశీనులను చేసి ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అర్చకులు లక్ష్మీ అష్టోత్తరం, లక్ష్మీ సహస్రనామాలతో అమ్మవారికి కుంకుమతో అర్చన చేశారు.
హిందూ సనాతన ధర్మంలో కుంకుమకు విశేష ప్రాధాన్యం ఉంది. వివాహితురాలైన మహిళ నుదుట కుంకుమ ధరించడం వల్ల భర్త దీర్ఘాయుష్షు పొందుతాడని హిందూ ధర్మం చెబుతోంది. లక్ష్మీ, సరస్వతి, పార్వతి అమ్మవార్ల పేర్లతో పిలుస్తున్న శక్తి అమ్మవారికి ప్రతిరూపంగా సింధూరం లేదా కుంకుమకు ప్రాశస్త్యం ఉంది. అమ్మవారి ఆలయాల్లో బ్రహ్మోత్సవాలలాంటి భారీ ఉత్సవాలను నిర్వహించే ముందు లక్షకుంకుమార్చన నిర్వహించడం సంప్రదాయం. ఈ విశిష్టమైన సేవ ద్వారా అమ్మవారు ప్రసన్నమై ఉత్సవాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా జరిగేలా ఆశీర్వదిస్తారని భక్తుల విశ్వాసం.
అంకురార్పణ :
శనివారం సాయంత్రం 6.30 నుండి రాత్రి 8.30 గంటల నడుమ పుణ్యాహవచనం, రక్షాబంధనం, సేనాధిపతి ఉత్సవం, యాగశాలలో అంకురార్పణ కార్యక్రమాలు చేపడతారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ జెఈఓ శ్రీమతి సదా భార్గవి, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, ఏఈవో శ్రీ ప్రభాకర్ రెడ్డి, ఆగమ సలహాదారు శ్రీ శ్రీనివాసాచార్యులు, ఆలయ సీనియర్ అర్చకులు శ్రీ బాబుస్వామి, సూపరింటెండెంట్లు శ్రీ శేషగిరి, శ్రీ మధు, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ దాము, ఇతర అధికారులు పాల్గొన్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.