PALLAKI UTSAVAM HELD _ పల్లకిలో మోహిని అలంకారంలో శ్రీ వేణుగోపాల స్వామి

TIRUPATI, 02 JUNE 2024: As part of the ongoing annual Brahmotsavam in Sri Venugopala Swamy temple at Karvetinagaram, Mohini Avataram took place on Sunday.

Temple authorities, devotees participated in this fete.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

పల్లకిలో మోహిని అలంకారంలో శ్రీ వేణుగోపాల స్వామి

తిరుపతి, 2024 జూన్ 02: కార్వేటినగరం శ్రీ వేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవాల్లో ఐదవ రోజు ఆదివారం ఉదయం 7.30 గంటలకు పల్లకిలో మోహిని అలంకారంలో శ్రీ వేణుగోపాల స్వామి భక్తులకు దర్శనమిచ్చారు.

మంగళవాయిద్యాలు, భజనలు, కోలాటాల నడుమ ఆలయ మాడ వీధుల్లో కోలాహలంగా వాహనసేవ జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతుల సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.

ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈఓ శ్రీ పార్థసారథి, సూపరింటెండెంట్‌
శ్రీ సోమశేఖర్, ఆలయ అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.