SRI MALAYAPPA RIDES PUSHPAKA VIMANAM IN GOVERDHANA KRISHNUDU ALANKARAM _ పుష్ప‌క విమానంలో గోవర్ధన కృష్ణుడు రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప‌

Tirumala, 21 October 2020: In the evening of Day-6 of ongoing Srivari Navaratri Brahmotsavam Lord Malayappa swami blessed devotees on Pushpaka Vimanam in Govardhana Krishnudu Alankaram.

The pushpaka Vikamanam is a fete observed in Srivari temple once in three-year mode on the occasion of the Adhika Masam Navaratri Brahmotsavams.

The Pushpaka vimanam vahana seva is conducted inside Srivari temple for Sri Malayappa swami and his consorts to take a breather after a busy schedule of events like Snapana’s and vahana sevas etc.

The 15×14 feet Vimanam weighing 750 kgs is made out of coconut leafs and decorated with 150 kgs of traditional flowers like jasmine, marigold, Kanaka, Abram, Lily, roses and scented leafs,

The vimanam is decked with idols of Anjaneya and Garuda on both sides. The Idols of Asta Lakshmi are in the middle and in the second layer has elephants, parrots. Finally the hooded servants embellish the Vimanam.

Twenty workers from Salem I Tamilnadu and 10 workers from TTD garden department strive for 10 days to build the Pushpaka vimanam, said Sri Srinivasulu, Deputy Director of TTD garden department.

The Sri Ramaprasad Trust of Chennai donated material for making the vimanam.

TTD EO Dr KS Jawahar Reddy, Additional EO Sri AV Dharma Reddy, TTD board members Sri Chavireddy Bhaskar Reddy, Sri Vemireddy Prashanthi Reddy Sri DP Ananth, Dr Nichitha, Sri Chippagiri Prasad, Sri Govind Hari, CVSO Sri Gopinath Jatti and others were present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

పుష్ప‌క విమానంలో గోవర్ధన కృష్ణుడు రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప‌

తిరుమల, 2020 అక్టోబ‌రు 21: శ్రీవారి న‌వ‌రాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరవ రోజైన బుధ‌‌వారం మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు  శ్రీ‌వారి ఆల‌యంలోని క‌ల్యాణోత్స‌వ మండ‌పంలో రుక్మిణి స‌త్య‌భామ స‌మేత గోవర్ధనగిరి దారుడైన శ్రీకృష్ణుని అలంకారంలో శ్రీ మ‌ల‌య‌ప్పస్వామివారు  ‌పుష్ప‌క విమానంలో అభ‌య‌మిచ్చారు.

పుష్ప‌క విమానం మూడు సంవత్సరాలకు ఒకసారి వచ్చే అధిక మాసం సంద‌ర్భంగా నిర్వ‌హించే నవరాత్రి బ్రహ్మోత్సవాలలో నిర్వ‌హిస్తారు. వాహనసేవల్లో అలసిపోయే స్వామి, అమ్మ‌వార్లు సేద తీరడానికి పుష్ప‌క విమానంలో వేంచేపు చేస్తారు.

ఈ ప్రత్యేకమైన విమానం కొబ్బరి చెట్ల ఆకులతో తయారు చేశారు. ఇది 15 అడుగుల ఎత్తు, 14 అడుగుల వెడల్పు 750 కేజిల బ‌రువు ఉంటుంది. ఇందులో 150 కేజిల మల్లి,  క‌న‌కాంబ‌రం, మొల్ల‌లు, వృక్షి, చామంతి, లిల్లి, తామరపూలు, రోజాలు తదితర 9 రకాల సాంప్రదాయ పుష్పలు ఉప‌యోగించారు.

శ్రీ‌వారి పుష్ప‌క విమానాన్ని మూడు ద‌శ‌ల‌లో ఏర్పాటు చేశారు. విమానంకు ఇరువైపులా శ్రీ ఆంజ‌నేయ‌స్వామి, శ్రీ గ‌రుడ‌ళ్వార్‌ న‌మ‌స్క‌రిస్తున్నట్లుగా, మొద‌టి ద‌శ‌లో అష్టలక్ష్ములు, రెండ‌వ ద‌శ‌లో ఏనుగులు, చిల‌క‌లు, మూడ‌వ ద‌శ‌లో నాగ ప‌డ‌గ‌ల ప్ర‌తిమ‌ల‌తో రూపొందించారు.

తమిళనాడులోని సేలంకు చెందిన 20 మంది, టిటిడి గార్డెన్ విభాగంకు చెందిన 10 మంది వారం రోజుల ‌పాటు శ్ర‌మించి ఈ అద్భుతమైన విమానంను సిద్ధం చేశార‌ని టిటిడి గార్డెన్ విభాగం డెప్యూటీ డైరెక్ట‌ర్‌ శ్రీ శ్రీ‌నివాసులు తెలిపారు. తమిళనాడు చెన్నైకు చెందిన దాత శ్రీ రాంప్ర‌సాద్ బ‌ట్టు‌ శ్రీవారి పుష్ప‌క విమానాన్ని ఆకర్షణీయంగా రూపొందించేందుకు సహాకారాన్ని అందించారు.  

ఈ కార్య‌క్ర‌మంలో శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద‌జీయ‌ర్‌స్వామి, శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న‌జీయ‌ర్‌స్వామి, ఈవో డా. కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి, అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి, బోర్డు స‌భ్యులు శ్రీ చెవిరెడ్డి భాస్క‌ర్‌రెడ్డి, శ్రీ‌మ‌తి వేమిరెడ్డి ప్ర‌శాంతి రెడ్డి, డా. నిశ్చిత‌, శ్రీ చిప్ప‌గిరి ప్ర‌సాద్‌, శ్రీ గోవింద‌హ‌రి, శ్రీ డిపి.అనంత‌, సివిఎస్వో శ్రీ గోపినాథ్ జెట్టి, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.
             
తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.