VALMIKIPURAM PAVITROTSAVAMS CONCLUDES _ పూర్ణాహుతితో ముగిసిన వాల్మీకిపురం శ్రీ పట్టాభిరామస్వామివారి పవిత్రోత్సవాలు
పూర్ణాహుతితో ముగిసిన వాల్మీకిపురం శ్రీ పట్టాభిరామస్వామివారి పవిత్రోత్సవాలు
తిరుపతి, 2019 అక్టోబరు 14: టిటిడికి అనుబంధంగా ఉన్న వాల్మీకిపురం శ్రీ పట్టాభిరామస్వామివారి ఆలయంలో మూడు రోజులపాటు జరిగిన పవిత్రోత్సవాలు సోమవారం పూర్ణాహుతితో ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.
ముందుగా స్వామివారిని ఉదయం సుప్రభాతంతో మేల్కొలిపి తోమాల సేవ, సహస్రనామార్చన నిర్వహించారు. ఉదయం 6 గంటలకు మహాపూర్ణాహుతి, పవిత్ర విసర్జన, కుంభప్రోక్షణ, అభిషేకం తదితర వైదిక కార్యక్రమాలు జరిగాయి. ఉత్సవమూర్తులకు స్నపనతిరుమంజనం వైభవంగా జరిగింది. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరినీళ్లతో విశేషంగా అభిషేకం చేశారు. స్వామివారికి చక్రస్నానం, పవిత్ర వితరణ నిర్వహించారు. సాయంత్రం 7 గంటల నుండి తిరువీధి ఉత్సవం జరుగనుంది.
ఈ కార్యక్రమంలో టిటిడి స్థానికాలయాల డెప్యూటీ ఈవో శ్రీ ఎల్లప్ప, సూపరింటెండెంట్ శ్రీ ముని చెంగల్ రాయలు, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ పి.మోహన్‌రావు, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.
Tirupati, 14 Oct. 19: The annual three-day pavitrotsavams in Sri Pattabhirama Swamy temple at Valmikipuram were concluded on a grand religious note on Monday.
Maha Purnahuti was performed as a part of the fete on the last day of the Pavitrotsavams.
Temple DyEO Sri Ellappa, Temple Inspector Sri Munichengalrayalu and others were also present.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI