PURNAHUTI HELD _ పూర్ణాహుతితో ముగిసిన శ్రీ పద్మావతి అమ్మవారి పవిత్రోత్సవాలు
TIRUPATI, 10 SEPTEMBER 2022: Purnahuti was held in Tiruchanoor on Saturday evening.
With this ritual the three day annual Pavitrotsavams concluded on a religious note in Sri Padmavathi Ammavaru temple.
Temple DyEO Sri Lokanatham and others were present.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
పూర్ణాహుతితో ముగిసిన శ్రీ పద్మావతి అమ్మవారి పవిత్రోత్సవాలు
రుపతి, 2022 సెప్టెంబరు 10: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో మూడు రోజులపాటు జరిగిన పవిత్రోత్సవాలు శనివారం మహాపూర్ణాహుతితో ముగిశాయి. ఉత్సవాల్లో భాగంగా చివరిరోజు ఆలయంలో విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం 11 నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు శాస్త్రోక్తంగా మహాపూర్ణాహుతి, శాంతి హోమం, కుంభప్రోక్షణ, నివేదన నిర్వహించారు.
చక్రస్నానం :
మధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 5 గంటల వరకు శ్రీకృష్ణ స్వామి ముఖ మండపంలో అమ్మవారితో పాటు శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్ కు శాస్త్రోక్తంగా స్నపనతిరుమంజనం నిర్వహించారు. ఆ తర్వాత చక్రత్తాళ్వార్‌ను పల్లకీపై ఊరేగింపుగా పద్మపుష్కరిణి వద్దకు తీసుకెళ్లి శాస్త్రోక్తంగా చక్రస్నానం నిర్వహించారు. సాయంత్రం 6.30 నుంచి రాత్రి 9 గంటల వరకు శ్రీకృష్ణస్వామివారు, శ్రీసుందరరాజస్వామివారు, శ్రీ పద్మావతి అమ్మవారు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమివ్వనున్నారు.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, ఏఈవో శ్రీ ప్రభాకర్‌రెడ్డి, ఆగమ సలహాదారు శ్రీ శ్రీనివాసాచార్యులు, కంకణభట్టార్ శ్రీ వేంపల్లి శ్రీనివాస్, అర్చకులు శ్రీ బాబుస్వామి, సూపరింటెండెంట్ శ్రీ శేషగిరి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ దామోదరం తదితరులు పాల్గొన్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.