SHODASHADINA SUNDARAKAANDA PARAYANAM CONCLUDES WITH PURNAHUTHI _ పూర్ణాహుతితో ముగిసిన షోడ‌శ‌దిన సుంద‌ర‌కాండ పారాయ‌ణ దీక్ష

CONTROL OF CORONA WILL BE ACHIEVED SOON WITH THE BLESSING OF LORD VENKATESWARA- TTD EO DR KS JAWAHAR REDDY

Tirumala, 14 Oct. 20: The unique spiritual program of Shodashadina Sundarakanda Parayanam was observed with objective of containing the pandemic Covid-19 which will be certainly achieved with the benign blessings of Sri Venkateswara Swamy, asserted TTD EO Dr KS Jawahar Reddy.

He participated in the Purnahuti event heralding conclusion of the

Shodashadina Sundarakanda Parayanams at the Dharmagiri Veda Vignana Peetham.

Speaking on the occasion he said it was his holy privilege to participate in the Purnahuti ritual, his maiden religious event after his assuming charge as TTD EO.

He said in state government he served as Principal Secretary Health and Family welfare and strived to contain the pandemic with scientific and technical parameters. Now as TTD EO he will strive in spiritual means to end the global menace of Corona virus with the blessings of Lord Venkateswara.

The EO lauded the efforts of Additional EO Sri A V Dharma Reddy in making the program a huge success and the donors who contributed for conceiving the unique spiritual program.

He also highly appreciated the team of Vedic pundits of Dharmagiri Veda Vijnan Peetham and it’s Principal Sri KSS Avadhani, Sundarakanda Upasakas, faculty members for their dedication in parayanams, Homams and Japa Yagnams.

Later the Additional EO Sri A V Dharma Reddy said 32 Sundarakanda Upasakas from other states besides those from Andhra Pradesh participated in the Vedic effort to get global relief from pandemic Corona. While the upasakas performed Shloka parayanams and homas with dedication, crores of devotees had followed the Diksha at their homes by watching the live telecast on SVBC.The sky rocketing TRP rating achieved by the channel in the recent times is a testimony to the fact, he added.

He said the liberal contributions by Smt Swarnalatha, the spouse of TTD Chairman Sri YV Subba Reddy, TTD trust board members Sri Krishnamurthy Vaidyanathan and Sri Sekhar Reddy and other philanthropists from different states had made the 16 days Diksha a grand success.

Earlier, the principal of Veda Vignana Peetham Sri KSS Avadhani and his team performed Vasoddhara homam, Purnapaatra Visarjanam, Brahmasthapana and Narayana Suktam as part of the Purnahuti ritual at the Prarthana mandiram of the Vedic institution.

Earlier to that the shloka parayanam of sundarakanda was completed at the Vasantha Mandapam located to backside of Srivari temple.

Along with the Maha Mantra “ Raghavo- Vijayam- Dadyaanmama- SitaPathi – hi- Prabhuhu” in which the 16 syllables implied the 2821 slokas from all 68 Sargas of Sundarakanda were recited with utmost devotion. While on last day on Wednesday, the Shlokas from Yuddhakanda and Sri Rama Pattbhishekam were also recited.

The TTD EO along with Additional EO felicitated all 32 upasakas with shawls, Srivari Prasadam and honorariums. The TTD board member Sri Krishnamurthy Vaidyanathan also presented clothes to the upasakas. Later on representatives of the Sringeri Peetham also felicitated the TTD EO, Additional EO and the CVSO on the occasion.

CVSO Sri Gopinath Jatti, Vice-chancellor of National Sanskrit University Acharya Muralidhara Sharma, SVBC CEO Sri Suresh Kumar, Health Officer Dr R R Reddy, DyEOs Sri Harindranath, Sri Vijayasaradhi, Sri Balaji, OSD of SV Higher Vedic studies Institute Dr Akella Vibhishana Sharma and other officials participated.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

ద‌యతో క‌రోనా క‌ట్ట‌డి కావాలి : టిటిడి ఈవో డా. కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి

పూర్ణాహుతితో ముగిసిన షోడ‌శ‌దిన సుంద‌ర‌కాండ పారాయ‌ణ దీక్ష

తిరుమల, 2020 అక్టోబర్ 14: లోక‌క‌ల్యాణం కోసం క‌రోనా వ్యాధి క‌ట్ట‌డి కావాల‌నే సంక‌ల్పంతో షోడ‌శ‌దిన సుంద‌ర‌కాండ పారాయ‌ణ దీక్ష చేప‌ట్టామ‌ని, దేవ‌దేవుడైన శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ద‌య వ‌ల్ల ఆ సంక‌ల్పం త‌ప్ప‌క నెరవేరాల‌ని ఆశిస్తున్నాన‌ని టిటిడి ఈవో డా. కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి అన్నారు. బుధ‌వారం తిరుమ‌ల‌లోని ధ‌ర్మ‌గిరి వేద విజ్ఞాన పీఠంలో షోడ‌శ‌దిన సుంద‌ర‌కాండ పారాయ‌ణ దీక్ష ముగింపు సంద‌ర్భంగా జ‌రిగిన‌ పూర్ణాహుతి కార్య‌క్ర‌మంలో ఈవో పాల్గొన్నారు.  

ఈ సంద‌ర్భంగా ఈవో మాట్లాడుతూ టిటిడి ఈవోగా బాధ్య‌త‌లు స్వీక‌రించాక మొద‌టి వైదిక కార్య‌క్ర‌మంగా ఈ పూర్ణాహుతిలో పాల్గొన‌డం దైవానుగ్ర‌హ‌మ‌న్నారు. గ‌తంలో రాష్ట్ర ప్ర‌భుత్వ అధికారిగా క‌రోనా క‌ట్ట‌డికి శాస్త్ర, సాంకేతిక ప‌ద్ధ‌తుల్లో కృషి చేశానని, ప్ర‌స్తు‌తం టిటిడి ఈఓగా వైదిక క్ర‌తువుల ద్వా‌రా వ్యాధిని నివారించేందుకు శ్రీ‌వారి అనుగ్ర‌హం కోసం ప్రార్థిస్తున్నాన‌ని చెప్పారు. ఈ దీక్షా కార్య‌క్ర‌మానికి రూప‌క‌ల్ప‌న చేసిన అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డికి మ‌న‌స్ఫూర్తిగా అభినందన‌లు తెలిపారు. ఈ కార్య‌క్ర‌మాన్ని పూర్తిగా దాత‌ల విరాళంతో నిర్వ‌హించామ‌ని, ఈ సంద‌ర్భంగా దాత‌ల‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేశారు. 16 రోజుల పాటు ఎంతో దీక్ష‌తో పారాయ‌ణం, హోమాలు, జ‌పాలు నిర్వ‌హించిన వేద విజ్ఞాన పీఠం ప్రిన్సిపాల్‌కు, అధ్యాప‌క బృందానికి, ఉపాస‌కులకు అభినంద‌న‌లు తెలియ‌జేశారు.

టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి మాట్లాడుతూ క‌రోనా నుంచి మాన‌వాళికి విముక్తి క‌ల్పించేందుకు ఈ దీక్ష చేప‌ట్టామ‌ని, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌తో పాటు ఇత‌ర రాష్ట్రాల నుండి 32 మంది ఉపాసకుల‌ను ఆహ్వానించామ‌ని తెలిపారు. టిటిడిలో మొట్ట‌మొద‌టిసారిగా ఈ దీక్ష‌ను నిర్వ‌హించామ‌ని, ఉపాస‌కులు ఎంతో నియ‌మనిష్ట‌ల‌తో శ్లోక పారాయ‌ణం, హోమాలు నిర్వ‌హించార‌ని వివ‌రించారు. ఎస్వీబీసీ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం ద్వారా కోట్లాది మంది భ‌క్తులు వారి ఇళ్ల‌లో ఈ దీక్ష చేప‌ట్టి పారాయ‌ణం చేశార‌ని, ఛాన‌ల్‌కు వ‌చ్చిన టిఆర్‌పి రేటింగ్ ఇందుకు నిద‌ర్శ‌న‌మ‌ని చెప్పారు. టిటిడి ఛైర్మ‌న్ శ్రీ వైవి.సుబ్బారెడ్డి గారి సతీమ‌ణి శ్రీ‌మ‌తి స్వ‌ర్ణ‌ల‌త, బోర్డు స‌భ్యులు శ్రీ కృష్ణ‌మూర్తి వైద్య‌నాథ‌న్‌, శ్రీ శేఖ‌ర్‌రెడ్డితోపాటు ప‌లువురు దాత‌లు ఇచ్చిన విరాళాల‌తో ఈ 16 రోజుల దీక్షా కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వంతంగా నిర్వ‌హించామ‌న్నారు.

ముందుగా వేద విజ్ఞాన పీఠంలోని ప్రార్థ‌నా మందిరంలో ప్రిన్సిపాల్ శ్రీ కెఎస్ఎస్‌.అవ‌ధాని ఆధ్వ‌ర్యంలో పూర్ణాహుతిలో భాగంగా వ‌శోద్ధార హోమం, పూర్ణ‌పాత్ర విస‌ర్జ‌న‌, బ్ర‌హ్మ స్థాప‌న చేప‌ట్టి  నారాయ‌ణ సూక్తం ప‌ఠించారు. అంత‌కుముందు శ్రీ‌వారి ఆల‌యం వెనుక‌వైపు గ‌ల వ‌సంత మండ‌పంలో సుంద‌ర‌కాండ శ్లోక‌ పారాయ‌ణం ముగిసింది. ముగింపు రోజున శ్రీ‌రామ‌ప‌ట్టాభిషేకం శ్లోకాల‌ను కూడా ప‌ఠించారు. వ‌సంత మండ‌పంలో “రాఘ‌వో విజ‌‌యం ద‌ద్యాన్మ‌మ సీతా ప‌తిఃప్ర‌భుః ” అనే మహామంత్రం ప్రకారం సుంద‌ర‌కాండ‌లోని మొత్తం 68 స‌ర్గ‌ల్లో గల 2,821 శ్లోకాల‌ను 16 మంది సుందరకాండ ఉపాసకులు 16 రోజుల పాటు అత్యంత దీక్షాశ్రద్ధలతో పారాయ‌ణం చేశారు. అదేవిధంగా, ధ‌ర్మ‌గిరి వేద పాఠ‌శాల‌లో మ‌రో 16 మంది ఉపాస‌కులు 16 రోజుల పాటు జ‌ప‌, హోమ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు.

అనంత‌రం టిటిడి ఈవో, అద‌న‌పు ఈవో క‌లిసి 32 మంది ఉపాస‌కుల‌ను శాలువ‌తో స‌న్మానించి శ్రీ‌వారి ప్ర‌సాదం, సంభావ‌న అంద‌జేశారు. బోర్డు స‌భ్యులు శ్రీ కృష్ణ‌మూర్తి వైద్య‌నాథ‌న్ ఉపాస‌కుల‌కు వ‌స్త్ర బ‌హుమానం అందించారు. ఆ త‌రువాత శృంగేరి పీఠం త‌ర‌ఫున వారి ప్ర‌తినిధులు విచ్చేసి టిటిడి ఈవో, అద‌న‌పు ఈవో, సివిఎస్వోను స‌న్మానించారు.

ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి సివిఎస్వో శ్రీ గోపినాథ్ జెట్టి, కేంద్రీయ సంస్కృత వ‌ర్సిటీ ఉప‌కుల‌ప‌తి ఆచార్య ముర‌ళీధ‌ర శ‌ర్మ‌, ఎస్వీబీసీ సిఈవో శ్రీ సురేష్ కుమార్‌, ఆరోగ్య శాఖాధికారి డాక్ట‌ర్ ఆర్ఆర్‌.రెడ్డి, డెప్యూటీ ఈవోలు శ్రీ హ‌రీంద్ర‌నాథ్‌, శ్రీ విజ‌య‌సార‌ధి, శ్రీ బాలాజి, విజివోలు శ్రీ మ‌నోహ‌ర్‌, శ్రీ ప్ర‌భాక‌ర్‌, ఎస్వీ ఉన్న‌త వేదాధ్య‌య‌న సంస్థ ప్రాజెక్టు అధికారి డా. ఆకెళ్ల విభీష‌ణ‌శ‌ర్మ త‌దిత‌రులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.