RAMAYANA PARAYANA YAGNAM CONCLUDES WITH PURNAHUTI _ పూర్ణాహుతితో ముగిసిన షోడ‌శ‌దిన కిష్కింధాకాండ పారాయణదీక్ష

TIRUMALA, 15 JULY 2023: The Ramayana Parayana Yagnam concluded with Maha Purnahuti held at Dharmagiri Veda Vignana Peetham at Tirumala on Saturday.

 

Speaking on the occasion, TTD EO Sri AV Dharma Reddy said during the Covid pandemic TTD commenced this Parayana Yagnam with Sundarakanda, followed by Balakanda, Ayodhya Kanda, Yuddhakanda, Aranyakanda and Kishkindakanda.

 

Every shlokam penned by Sage Valmiki was recited and explained by stalwarts on Nada Neerajanam platform.

 

All these Parayanam recordings are available with SVBC. The devotees shall download the Shlokas with Tatparyams and perform Pujavidhi at their households.

 

Besides, TTD recites Sodasadina Sundarakanda in first and second halves of a year and also Ekadina Nirantara Parayanam on the auspicious day of Hanuman Jayanti.

 

After Purnahuti he felicitated all the 32 Ritwiks who rendered Parayanam and performed Homams during these 16 days.

 

Earlier the Sodasadina Parayanam concluded at Vasanta Mandapam. SVBC telecasted live of both Parayanam and Homam everyday for the sake of global devotees.

 

The entire event took place under the supervision of Dharmagiri Veda Vignana Peetham Principal Sri KSS Avadhani.

 

CEO SVBC Sri Shanmukh Kumar, VGO Sri Bali Reddy, Vedic scholars, students, devotees were also present.

 

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

లోక క‌ల్యాణార్థం కిష్కింధాకాండ పారాయ‌ణం

-. భక్తులకు అందుబాటులో సంపూర్ణ రామాయణం : టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి

– తిరుమ‌ల‌లో ముగిసిన కిష్కింధాకాండ పారాయ‌ణం

తిరుమ‌ల‌, 2023 జూలై 15: లోక క‌ల్యాణార్థం, సృష్టిలోని సకల జీవరాసులు ఆయురారోగ్యాలతో ఉండాలని శ్రీ‌వారిని ప్రార్థిస్తూ తిరుమ‌ల‌లో 16 రోజుల పాటు నిర్వ‌హించిన కిష్కింధాకాండ పారాయ‌ణం శ‌నివారం మ‌హా పూర్ణాహుతితో ముగిసింద‌ని టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి తెలిపారు. మ‌హాపూర్ణాహుతి కార్య‌క్ర‌మంలో ఈవో దంప‌తులు పాల్గొన్నారు.

తిరుమ‌ల ధ‌ర్మ‌గిరి వేద విజ్ఞానపీఠం ప్రిన్సిపాల్ శ్రీ కుప్పా శివ‌సుబ్ర‌మ‌ణ్య అవధాని ఆధ్వ‌ర్యంలో వ‌సంత మండ‌పంలో కిష్కింధాకాండలోని శ్లోకాల పారాయ‌ణం, ధ‌ర్మ‌గిరి వేద విజ్ఞానపీఠంలో జ‌ప‌-త‌ర్ప‌ణ-హోమాలు నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా ఈవో మాట్లాడుతూ, ప్ర‌పంచ మాన‌వాళి సంక్షేమం కొర‌కు ధ‌‌ర్మ‌గిరి వేద విజ్ఞానపీఠంలో జూన్ 30 నుండి జూలై 15వ తేదీ వ‌ర‌కు షోడస దినాత్మక కిష్కింధాకాండ పారాయణ దీక్ష నిర్వహించినట్లు తెలిపారు. సుందరకాండ పారాయణంతో ప్రారంభమైన రామాయణ పారాయణ మహా యజ్ఞం యుద్ధకాండ, బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధాకాండలతో పూర్తయిందని చెప్పారు. ఇందులోని ప్రతి శ్లోకాన్ని భక్తులతో పలికించి జ‌ప‌-త‌ర్ప‌ణ-హోమాలు నిర్వహించినట్లు తెలిపారు. రామాయణంలోని అన్ని కాండాలలోని శ్లోకాలు ఎస్విబిసిలో రికార్డు రూపంలో భక్తులకు అందుబాటులో ఉన్నదన్నారు. భక్తులు ఎప్పుడైనా ఏ కాండములోని శ్లోకాలు కావాలన్నా డౌన్లోడ్ చేసుకొని వినవచ్చని చెప్పారు.

సంవత్సరంలో మూడుసార్లు సుందరకాండ పారాయణం నిర్వహించినట్లు తెలిపారు. ఇందులో రెండుసార్లు షోడశదినాత్మక సుందరకాండ పారాయణ దీక్ష, హనుమజ్జయంతి పర్వదినాన 18 గంటల పాటు సుందరకాండ పారాయణ యజ్ఞం నిర్వహిస్తున్నట్లు వివరించారు.

ధ‌ర్మ‌గిరి వేద విజ్ఞానపీఠంలో :

ధ‌ర్మ‌గిరి వేద విజ్ఞానపీఠంలోని ప్రార్థ‌నా మందిరంలో ప్ర‌తి రోజు కిష్కింధాకాండ పారాయ‌ణంలో భాగంగా విశేష మంత్రాల‌తో జ‌ప‌-త‌ర్ప‌ణ-హోమాదులు నిర్వ‌హించారు. లోక క్షేమం కోసం 16 రోజుల పాటు ఉపాస‌కులు అకుంఠిత‌ దీక్ష, శ్ర‌ద్ధ‌ల‌తో శ్రీ సీతాల‌క్ష్మ‌ణ ఆంజ‌నేయ‌స్వామి స‌మేత శ్రీ రామ మూల మంత్రానుష్ఠానం 16 ల‌క్ష‌ల సార్లు జ‌పించారు. జ‌పంలో ప‌ద‌వ వంతు ఆవు పాల‌తో త‌ర్ప‌ణం, త‌ర్ప‌ణంలో 10వ వంతు హోమాలు నిర్వ‌హించారు. ఇందులో వాస్తుహోమం, చ‌తుష‌ష్ఠి యోగిని మండ‌పం, క్షేత్ర పాల‌క మండ‌పం, న‌వ‌గ్ర‌హ మండలం, శ్రీ‌రామ ద‌శావ‌ర‌ణ యంత్ర పూజ‌, షోడ‌శ రామ‌లింగ‌తో భ‌ద్ర మండ‌ల పూజ‌, రామ చ‌తురాయ‌త‌న క‌ల‌శ పూజ‌, మంత్ర పుష్పం, ద‌ర్భార్ సేవ నిర్వ‌హించారు.

మ‌హా పూర్ణాహూతి సంద‌ర్బంగా శ‌నివారం ఉద‌యం మూల మంత్ర, శ్లోక, మండ‌ప దేవ‌త, అంగ, పౌష్ఠిక, శాంతి, జ‌యాతి హోమాలు మరియు కుంభారాధ‌న జ‌రిగింది. త‌రువాత స‌మ‌స్త దోషాలు తోల‌గి పోవాల‌ని అభిజిత్ ల‌గ్నంలో మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు సంక‌ల్పం, హోమ‌ద్ర‌వ్య పూజ‌, బ‌లి ప్ర‌దానం, ద్ర‌వ్య స‌మ‌ర్ప‌ణ‌, వ‌సోర్ధారా హోమం, మహా పూర్ణాహుతి నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మాన్ని ఎస్వీబీసీ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేసింది.

వ‌సంత మండ‌పంలో :

అంత‌కుముందు తిరుమ‌ల వ‌సంత మండ‌పంలో కార్య‌క్ర‌మం ప్రారంభంలో ధ‌ర్మ‌గిరి వేద విజ్ఞానపీఠం ప్రిన్సిపాల్ శ్రీ కుప్పా శివ‌సుబ్ర‌మ‌ణ్య అవధాని మాట్టాడుతూ వేద పారాయ‌ణం చేస్తే ఎంత ఫ‌లం ల‌భిస్తుందో, రామాయ‌ణంలోని కిష్కింధాకాండ పారాయ‌ణం చేయ‌డం వ‌ల‌న అంత‌టి ఫ‌లితం క‌లుగుతుంద‌ని తెలిపారు. కిష్కింధాకాండ పారాయ‌ణం వ‌ల‌న శ‌త్రువులు, గ్రహాల్లో ద‌శ‌లు, అంత‌ర్ ద‌శ‌ల్లో క‌ల‌గే చెడు ఫ‌లితాలు తొలగిపోతాయన్నారు.

చివ‌రి రోజున కిష్కింధాకాండలోని 63 నుండి 67వ‌ స‌ర్గ వ‌ర‌కు ఉన్న 160 శ్లోకాల‌ను 16 మంది ఉపాసకులు అత్యంత దీక్షా శ్రద్ధలతో పారాయ‌ణం చేశారు.

అనంతరం ఈవో పారాయణ దీక్షలో పాల్గొన్న 32 మంది వేద పండితులకు శ్రీవారి ప్రసాదాలు బహూకరించారు.

ఈ కార్య‌క్ర‌మంలో ఎస్వీబీసి సిఈవో శ్రీ షణ్ముఖ కుమార్, విజివో శ్రీ బాల్ రెడ్డి,
వేద పండితులు, విద్యార్థులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.