TIRUPPAVAI COMMENCES AT SRIVARI TEMPLE _ శ్రీవారి ఆలయంలో సుప్రభాతం స్థానంలో తిరుప్పావై

•  TIRUPPAVAI PRAYANAMS HELD AT PEDDA JEEYAR SWAMY MUTT AND ASTHANA MANDAPAM

 

Tirumala,17 December 2023: With the commencement of holy Dhanurmasam in the early hours of Sunday at 12.34 am, the auspicious Tiruppavai pravachanam replaced Suprabhatam in Srivari temple.

 

The divine Dhanurmasa Parayanams will be continued till January 14.

 

ANDAL TIRUPPAVAI PARAYANAMS

 

Sri  Goda Devi is one among the 12 Alwars scripted Pasurams praising in Tamil. Each day one Pasuram will be recited at Srivari temple during month-long Dhanurmasa festivities.

 

The Tiruppavai Pathanam will be held in Ekantham and instead of Bhoga Srinivasa Murthy, Sri Krishna Swami utsava idol will be worshipped.

 

Tiruppavai Pathanam  at Pedda Jeeyarswamy mutt and Asthana Mandapam 

 

The Tiruppavai Pathanam was initiated at Pedda jeeyarswamy mutt and Asthana Mandapam on Sunday between 7am and 8am and was live telecast by SVBC channel.

 

Tirumala pontiffs Sri Sri Sri Pedda Jeeyarswamy, Sri Sri Sri Chinna Jeeyarswamy participated in the pravachanams and blessed devotees with Mangala Sasanams.

 

Sri KE Lakshmi Narasimhan of Srivari temple presented two Pashuras of Tiruppavai Pathanam on the first day.

 

As part of Dhanurmasa festivities Dr Vandana, lecturer at SV College of Music and Dance presented  Goda Devi Sankeertans at the Nada Neerajanam platform.

 

Vedic scholar from Hyderabad Dr Govardhan Swaminathacharyulu performed Tiruppavai Pravachanams at Asthana Mandapam.

 

EO Sri AV Dharma Reddy and other TTD officials were present.

 

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీవారి ఆలయంలో సుప్రభాతం స్థానంలో తిరుప్పావై

•⁠ ⁠ధనుర్మాసం ప్రారంభం

•⁠ ⁠పెద్దజీయర్ మ‌ఠం, ఆస్థాన మండపంలో తిరుప్పావై పారాయ‌ణం

 తిరుమల, 2023 డిసెంబరు 17: ధనుర్మాసం ప్రారంభం కావడంతో తిరుమల శ్రీవారి ఆలయంలో ఆదివారం ఉదయం సుప్రభాత సేవ స్థానంలో తిరుప్పావై నివేదించారు. జనవరి 14వ తేదీ వరకు తిరుప్పావై పారాయణం కొనసాగుతుంది. ఆదివారం తెల్లవారుజామున 12.34 గంటలకు ధనుర్మాస ఘడియలు ప్రారంభమయ్యాయి.

ధనుర్మాసానికి విశేష ప్రాధాన్యం…

పురాణాల ప్రకారం ధనుర్మాసంలో దేవతలు సూర్యోదయానికి ఒకటిన్నర గంట ముందుగా నిద్రలేచి బ్రహ్మ ముహూర్తంలో శ్రీమహావిష్ణువును ప్రత్యేకంగా ప్రార్థిస్తారు. కావున ఈ మాసానికి సౌరమానంలో ప్రత్యేక ప్రాధాన్యం ఉంది.

ఆండాళ్‌ తిరుప్పావై పారాయణం…

12 మంది ఆళ్వార్లలో శ్రీ ఆండాళ్‌(గోదాదేవి) ఒకరు. వీరిని నాచియార్‌ అని కూడా పిలుస్తారు. శ్రీవేంకటేశ్వరస్వామివారిని స్తుతిస్తూ ఆండాళ్‌ రచించిన 30 పాశురాలను కలిపి తిరుప్పావై అంటారు. ఆళ్వార్‌ దివ్యప్రబంధంలో తిరుప్పావై ఒక భాగం. తమిళ సాహిత్యంలో దీనికి విశేష ప్రాచుర్యం ఉంది. శ్రీవారి ఆలయంలో నెల రోజులపాటు జరిగే తిరుప్పావై పారాయణంలో రోజుకు ఒకటి వంతున అర్చకులు నివేదిస్తారు. ఈ సందర్భంలో సాధారణంగా భోగశ్రీనివాసమూర్తికి బదులుగా శ్రీకృష్ణస్వామివారికి ఏకాంతసేవ నిర్వహిస్తారు. ఈ తిరుప్పావై పఠనం పూర్తిగా ఏకాంతంగా జరుగుతుంది.

పెద్దజీయర్ మ‌ఠంలో, ఆస్థాన మండపంలో తిరుప్పావై పారాయ‌ణం ప్రారంభం

పవిత్ర ధనుర్మాసం సంద‌ర్భంగా తిరుమల శ్రీ పెద్దజీయర్ మ‌ఠంలో తిరుప్పావై పారాయ‌ణం ఆదివారం ప్రారంభమైంది. ఉద‌యం 7 నుండి 8 గంట‌ల వ‌ర‌కు జరిగిన ఈ కార్యక్రమాన్ని ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం చేసింది. శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్దజీయర్‌ స్వామి, శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్నజీయర్ స్వామి పాల్గొని మంగళాశాసనాలు అందించారు. శ్రీవారి ఆలయ పరిచారక శ్రీ కెఇ.లక్ష్మీనరసింహన్ తిరుప్పావై ప్రవచనం చేశారు. మొదటి రోజు రెండు పాశురాలను పారాయణం చేశారు. జ‌న‌వ‌రి 14వ తేదీ వ‌ర‌కు నెల రోజుల పాటు తిరుప్పావై పాశురాల‌ను పారాయ‌ణం చేస్తారు. ఈ సందర్భంగా నాదనీరాజనం వేదికపై గోదాదేవి సంకీర్తనలను ఎస్వీ సంగీత కళాశాల అధ్యాపకురాలు డా. వందన ఆలపించారు.

అదేవిధంగా తిరుమ‌ల ఆస్థాన‌మండ‌పంలో హైద‌రాబాదుకు చెందిన వేదాంత విద్వాంసులు డా. గోవ‌ర్ధ‌నం స్వామినాథాచార్యులు ఉద‌యం 8 నుండి 9 గంట‌ల వ‌ర‌కు తిరుప్పావై ప్ర‌వ‌చ‌నాలు వినిపించారు.

ఈ కార్యక్రమాల్లో టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.