పెరటాసికి తితిదే అధికారులు పూర్తిగా సమాయత్తం

పెరటాసికి తితిదే అధికారులు పూర్తిగా సమాయత్తం

తిరుపతి, అక్టోబర్‌-9, 2009: పెరటాసినెల సందర్భంగా శని, ఆదివారాలలో తమిళనాడు నుంచి పెద్ద ఎత్తున భక్తులు శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేయడం ఆనవాయితి. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని (10-10-2009) 4వ శనివారం కావున తిరుమలకు రానున్న భక్తులకు కావలసిన వసతి, శ్రీవారి దర్శనం, స్వామివారి తీర్థప్రసాదాలు తదితర సౌకర్యాలు కల్పించడానికి తితిదే అధికారులు పూర్తిగా సమాయత్తంగా వున్నారని తిరుమల తిరుపతి దేవస్థానముల కార్యనిర్వహణాధికారి శ్రీ ఐ.వై.ఆర్‌. కృష్ణారావు ఒక ప్రకటనలో తెలియజేశారు.

శ్రీవారికి చిత్రహారతి కార్యక్రమంలో భాగంగా స్థానిక మహతి ఆడిటోరియం నందు  శనివారం సాయంత్రం 6 గంటలకు బాపు దర్శకత్వం వహించిన ”సీతాకల్యాణం” చలన చిత్రాన్ని ఉచితంగా ప్రదర్శిస్తారు.

కనుక పురప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరడమైనది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.