FREE EYE CARE TO POOR- TTD CHAIRMAN _ పేద‌ల‌కు ఉచిత కంటి  వైద్యం అందించాలి – టిటిడి ఛైర్మ‌న్ శ్రీ వై.వి.సుబ్బారెడ్డి

Tirupati, 5 Jun. 20: TTD Chairman Sri YV Subba Reddy on Friday directed officials to provide quality free eye care to poor of Nellore, Prakasam and other Rayalaseema districts.

The Chairman visited Aravind Eye Hospital near Alipiri on Friday evening along with Tirupati JEO Sri P Basant Kumar.

Speaking to media later the TTD Chairman said TTD would construct Aravind Eye Hospital on 7-acre land with latest Kilofer technology to conduct free eye operations to poor across the state.

He instructed the officials to provide wide publicity on the surgical and other facilities available at this hospital from last April onwards to people of Rayalaseema.

Earlier, the patients had to visit either Hyderabad or Madurai. Now people can avail such quality and speciality care under the AP state government’s unique scheme Kanti Velugu.

Earlier Dr A Ashok Vardhan, CMO of the Aravind Eye Hospital made a Power point presentation on the special infrastructure and services available at the institute. The TTD Chairman also inspected the 112-acre land allocated by TTD for AP Science City near Alipiri.

He also visited the Central hospital and Sri Shankar Netralaya hospital and its operation theatres within the TTD administration building complex and enquired about services etc.

TTD CMO Dr Nageswara Rao and BIRRD director Dr Madanmohan Reddy and superintendent Dr Kusuma Kumari participated.

 ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

పేద‌ల‌కు ఉచిత కంటి  వైద్యం అందించాలి – టిటిడి ఛైర్మ‌న్ శ్రీ వై.వి.సుబ్బారెడ్డి

తిరుపతి, 2020 జూన్ 05: రాయ‌ల‌సీమ, నెల్లూరు, ప్ర‌కాశం జిల్లాల పేద ప్ర‌జ‌ల‌కు మ‌రింత ఉన్న‌త‌మైన ప్ర‌మాణాల‌తో ఉచితంగా కంటి వైద్య సేవ‌లు అందించాల‌ని టిటిడి ఛైర్మ‌న్ శ్రీ వై.వి.సుబ్బారెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. అలిపిరి స‌మీపంలోని ఎస్వీ అర‌వింద్‌ కంటి వైద్య‌శాలను శుక్ర‌వారం సాయంత్రం ఛైర్మ‌న్ తిరుప‌తి జెఈవో శ్రీ పి. బ‌సంత్ కుమార్‌తో క‌లిసి ప‌రిశీలించారు. 

అనంత‌రం టిటిడి  ఛైర్మ‌న్ మీడియాతో మాట్లాడుతూ ఆసుప‌త్రి నిర్మాణానికి టిటిడి కేటాయించిన 7 ఎక‌రాల స్ఠ‌లంలో అత్యా‌ధునిక‌మైన కేలోఫ‌ర్ టెక్నాల‌జీతో అర‌వింద్ కంటి వైద్య‌శాలను నిర్మించినట్లు తెలిపారు. అర‌వింద్ కంటి ఆసుప‌త్రి అందిస్తున్న సేవ‌ల గురించి రాష్ట్ర వ్యాప్తంగా విసృత ప్ర‌చారం చేసి పేద‌లంద‌రికి ఉచిత సేవ‌లు అప‌రేష‌న్లు అందించాల‌ని ఆసుప‌త్రి అధికారుల‌కు సూచించారు. గ‌త ఏడాది ఏప్రిల్ నెల‌లో కంటి ఆసుప‌త్రి ప్రారంభించి రాయ‌ల‌సీమ జిల్లాల ప్ర‌జ‌ల‌కు వైద్య సేవ‌లు అందిస్తొంద‌న్నారు. ఉమ్మ‌డి ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రంలో హైద‌రాబాద్‌లో ప్ర‌జ‌ల‌కు మంచి కంటి వైద్య సేవ‌లు అందించే ఆసుపత్రు‌లు ఉండేవన్నారు. 

కొత్త‌గా ఏర్ప‌డిన ఆంధ్ర ప్ర‌దేశ్‌లో ఆధునిక కంటి వైద్య సేవ‌లందించే ఆసుప‌త్రులు లేనందు వ‌ల‌న ప్ర‌జ‌లు కంటి వైద్య చికిత్స కొర‌కు హైద‌రాబాద్ లేదా త‌మిళ‌నాడులోని మ‌ధురైకి వెలుతున్న‌ట్లు వివ‌రించారు. రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు అత్యుత్త‌మైన కంటి వైద్య సేవ‌లు అందించేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపొందిచిన కంటి వెలుగు ప‌థ‌కం ద్వారా  అర‌వింద్ ఆసుప‌త్రి సేవ‌లు అందుబాటులోనికి తీసుకురావాల‌న్నారు. ఇందుకొసం ఆసుప‌త్రి యాజ‌మాన్యంతో చ‌ర్చ‌లు జ‌ర‌పాల‌ని తిరుప‌తి జెఈవోను ఆదేశించారు. 

అంత‌కుముందు అర‌వింద్ కంటి ఆసుపత్రి సిఎమ్‌వో  డా.ఎ.అశోక్ వ‌ర్థ‌న్ ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జంటేష‌న్ ద్వారా  ఆసుప‌త్రి కార్య‌క‌లాపాలు, సామాజిక సేవ‌ల గురించి‌ ఛైర్మ‌న్‌కు వివ‌రించారు. అనంత‌రం ఆసుప‌త్రిలోని రిసెప్ష‌న్, ఆప‌రేష‌న్ థియేట‌ర్‌, క్యాంటీన్, రోగుల‌కు అందుతున్న సౌక‌ర్యాల‌ను ప‌రిశీలించారు.

అనంత‌రం అలిపిరి స‌మీపంలో ఎపి సైన్స్ సిటి నిర్మాణం కోసం టిటిడి కేటాయించిన 112 ఎక‌రాల స్థ‌లాన్ని ప‌రిశీలించారు.

త‌రువాత  తిరుప‌తిలోని టిటిడి ప‌రిపాన భ‌వ‌నం స‌మూదాయంలోని సెంట్ర‌ల్ ఆసుప‌త్రిలోని శ్రీ శంక‌ర నేత్రాల‌య ఆసుప‌త్రిని, అప‌రేష‌న్ థియేట‌ర్‌ను ప‌రిశీలించారు. త‌రువాత శంక‌ర్ నేత్రాల‌య ట్ర‌స్టు ద్వారా చేస్తున్న వైద్య సేవ‌ల‌ను అధికారుల‌ను అడిగి తెలుసుకున్నారు.  ‌  

ఈ కార్యక్రమంలో టిటిడి సిఎమ్‌వో డా|| నాగేశ్వరరావు, బ‌‌ర్డ్ డైరెక్ట‌ర్ డా.మ‌ద‌న్‌మోహ‌న్ రెడ్డి, సూపరింటెండెంట్ డా.కుసుమ‌కుమారి పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.