TTD TO ADOPT FOUR VILLAGES_ ప్రభుత్వం సూచించిన నాలుగు గ్రామాల దత్తత

Tirupati, 7 October, 2009: The Tirumala Tirupati Devasthanams has all set to adopt four villages in the flood hit districts.

Addressing media persons in Tirupati on Wednesday evening TTD Board Chairman Sri  D.K Audikeshavulu said, “We will adopt one village each from Kurnool , Krishna, Guntur and Mehaboobnagar and extend all support to bring back their lives to normalcy”, he added.  He said TTD would also take up the responsibility of restoring the pristine glory of Mantralaya mutt and Alampur temple which were totally inundated in Krishna floods.

 TTD has so far distributed 40thousand food packets. Apart from this on Wednesday, TTD has sent 3000 blankets, 1500 shirts,100 pants, 500 sarees, rice bags, kitchen items to the flood-affected areas.

Sri I.Y.Krishna Rao, Executive Officer, TTDs, TTD Board Member Dr.M.Anjaiah were also present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

ప్రభుత్వం సూచించిన నాలుగు గ్రామాల దత్తత

తిరుపతి, అక్టోబర్‌-7, 2009: వరదభీబత్సంతో అతలాకుతలమైన మహబూబ్‌నగర్‌, కర్నూలు, కృష్ణా, గుంటూరు జిల్లాలో ప్రభుత్వం సూచించిన నాలుగు గ్రామాలను తిరుమల తిరుపతి దేవస్థానము దత్తత తీసుకొని వాటిని పునరుద్దిస్తామని తితిదే పాలకమండలి అధ్యకక్షులు డి.కె. ఆదికేశవులునాయుడు తెలిపారు.

బుధవారం తిరుపతి పద్మావతి అథిది గృహంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత 100 సంవత్సరములలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో వరదభీబత్సం జరిగిందని, దీనివలన భారీగా ప్రాణనష్టం, ఆస్తినష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. వేలాది మంది ప్రజలు కట్టుభట్టలతో నిరాశ్రయులైనారని మానవతాదృక్పదంతో వారిని ఆదుకోవలసిన అవసరం ఎంతైనా వుందని ఇందుకోసం ప్రతి ఒక్కరు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. తితిదే తన వంతు సాయంగా ఇప్పటికే 40 వేల ఆహార పాకెట్లను పంపామని చెప్పారు. 3 వేల దుప్పట్లు, 100 ప్యాట్లు, 1500 టీషర్టులు, 500 చీరలతో పాటు బియ్యం బస్తాలు, వంటసామాగ్రిని సైతం తరలిస్తున్నామని తెలియజేశారు. అదేవిధంగా నాలుగు గ్రామాలను దత్తత తీసుకొని పునరుద్దరిస్తామని తెలిపారు. వరదబాధితులకు సహాయ సహకారములు అందించే వారికి తితిదే ఉచిత ప్రయాణ సౌకర్యాలను కల్పిస్తుందని వెల్లడించారు. వరదబాధితులకోసం తితిదే ఉద్యోగులు ఒక్కరోజు జీతాన్ని విరాళంగా అందివ్వడం అభినందనీయమని పేర్కొన్నారు. శ్రీవారి సేవకులు, ధార్మికమండలి సభ్యులు వరద సహాయసహకారాల్లో పాలుపంచుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈనెల 9,10,11 తేదీలలో లండన్‌లో జరుగు యూరోపియన్‌ తెలుగు మహాసభలకు రాష్ట్రప్రభుత్వం తరపున పాల్గొనడానికి తనను ఎంపిక చేసినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రోశయ్యకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

అనంతరం తితిదే కార్యనిర్వహణాధికారి ఐ.వై.ఆర్‌. కృష్ణారావు మాట్లాడుతూ ఈనెల 28వ తేది రాష్ట్రంలోని 294 నియోజిక వర్గాలలో జరుగు కల్యాణమస్తు కార్యక్రమానికి విస్తుృత ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ఈకల్యాణమస్తులో పెళ్ళిచేసుకోబోవు దంపతులు ఈనెల 21వ తేది లోపు దరఖాస్తులు పంపాలని సూచించారు. వరదభీబత్సంతో అతలాకుతలమైన మహబూబ్‌నగర్‌, కర్నూలు, కృష్ణా, గుంటూరు జిల్లాలో కల్యాణమస్తును జరపాలని భావిస్తున్నామని అయితే అక్కడి పరిస్థితిపై ఆయా జిల్లాల కలెక్టర్లుతో చర్చించి తరువాత నిర్ణయిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమముపై ఈనెల 16వ తేదిన రాష్ట్రముఖ్యమంత్రి రోశయ్య అన్ని జిల్లాల కలెక్టర్లుతో వీడియో కన్పెరెన్స్‌ నిర్వహిస్తారని తెలిపారు.

అనంతరం పాలక మండలి సభ్యులు అంజయ్య మాట్లాడుతూ సామాన్య భక్తులకు త్వరిత గతిన శ్రీవారి దర్శనం కల్పించడానికి ఈనెల 21వ తేది నుండి శ్రీఘ్రదర్శనం ప్రవేశపెడుతున్నామని తెలియజేశారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.