ప్రభుత్వానికి రాములవారి ఆశీస్సులు ఉండాలి : దేవాదాయశాఖ మంత్రి శ్రీ వెలం పల్లి శ్రీనివాసరావు

ప్రభుత్వానికి రాములవారి ఆశీస్సులు ఉండాలి : దేవాదాయశాఖ మంత్రి శ్రీ వెలం పల్లి శ్రీనివాసరావు

ఒంటిమిట్ట 26 ఏప్రిల్ 2021: కరోనా కష్ట కాలంలో కూడా ప్రజల సంక్షేమ, అభివృద్ధి పనులు కొనసాగిస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డికి శ్రీరాముల వారి ఆశీస్సులు ఉండాలని దేవాదాయశాఖ మంత్రి శ్రీ వెలం పల్లి శ్రీనివాసరావు కోరుకున్నారు.

ఒంటిమిట్ట శ్రీ కోదండ రామ స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా సోమవారం రాత్రి కళ్యాణం నిర్వహించనున్నారు. స్వామివారి కల్యాణానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున ఆయన పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ, రాములవారి కల్యాణానికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించే అదృష్టం ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి తనకు ఇచ్చారని చెప్పారు. కోవిడ్ కారణంగా బ్రహ్మోత్సవాలు ఏకాంతంగా, శాస్త్రోక్తంగా చాలా బాగా నిర్వహిస్తున్నారని అన్నారు. రాష్ట్ర ప్రజలందరి మీద కూడా శ్రీ రామచంద్రమూర్తి కరుణా కటాక్షాలు ఉండాలని ఆయన చెప్పారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది