TTD CHAIRMAN REVIEWS WITH SHIRIDI SAMATHAN AUTHORITIES _టీటీడీ చర్యలు భేష్ షిర్దీ సంస్థాన్ ప్రశంసఅన్న‌మ‌య్య భ‌వ‌నంలో టిటిడి ఛైర్మ‌న్ అధ్య‌క్ష‌త‌న స‌మావేశం

TTD TO PURSUE THIS PROPOSAL BY SHIRDI SAMATHAN

 TTD CHAIRMAN REVIEWS WITH SHIRDI SAMATHAN AUTHORITIES

 Tirumala, 26 September 2020: To put an end to the devious operations of fake websites the authorities of Shirdi Samathan have proposed to TTD that the names of official websites of all Hindu temples in the country should be displayed on the prominent temple websites for providing accurate and authentic information to pilgrim public. 

The delegation of Shirdi Samsthan is in Tirumala for an on-site study of the Darshan management and other arrangements by TTD administration even in the Covid-19 situation following all the norms prescribed by Central and State Governments.

A review meeting on the same was held at Annamaiah Bhavan in Tirumala on Saturday which was presided over by TTD Trust Board Chairman Sri YV Subba Reddy along with TTD EO Sri Anil Kumar Singhal. 

The TTD Chairman Sri YV Subba Reddy has directed the TTD officials to study the proposal on website names of other temples by the Shirdi Samsthan to take further action.

A power point presentation was made for the benefit of the visiting delegation on the Srivari darshan, accommodation, queue lines management, Annaprasadam, Srivari Seva, Accounts, Laddu Prasadam counters during the COVID-19 restrictions period. A focus on the multifarious, devotee welfare, socio-economic-dharmic activities were also presented at the meeting.

Speaking, the TTD Chairman Sri Y V Subba Reddy said that following directives of the Central and State Governments, the annual Brahmotsavams are being conducted in Ekantham following Agama traditions and performing all rituals.

He said that as a top Hindu temple, TTD is always ready to share with other temples on strategies for providing comfortable Darshan facilities to devotees.

The Samsthan officials were also appraised of the online facilities provided by TTD in Srivari Darshan tickets accommodation, donations etc.

It was also discussed to see the possibilities to float Federation of all prominent Hindu temples in the realm of Sanatana Hindu Dharma Prachara by holding annual conference to share initiatives. 

ON GUDIKO GOMATA

Adding further, the Chairman said under the direction of Honourable Chief Minister of Andhra Pradesh Sri Y S Jaganmohan Reddy, TTD has launched the unique Gudiko Gomata program in 35 temples in AP, TS, TN and Karnataka on an experimental basis. 

Sri Harishchandra Bagate, the CEO of Shirdi Samsthan said his team witnessed the Queue line management, Anna Prasadam, Laddu Prasadam, Security and Vigilance. He also said, the strategies explained through the powerpoint presentation will be of great use for them to replicate at Shirdi.

LAUNCH GUDI-KI-GOMATA PROGRAM AT SHIRDI- TTD CHAIRMAN

TTD Chairman Sri YV Subba Reddy told the CEO of Shirdi Samsthan also to launch the Gudi-ko-Gomata program at Shirdi as well and has given a representation to this effect to him through TTD board member Sri Siva Kumar.

The CEO of Shiridi shrine said, the Samsthan is also keen to present a Gomata to TTD and the unique programme will be discussed with Samathan Board for launching a similar program at Shiridi too. 

TTD Chairman also said that he would present a Gomata to Shirdi Samsthan and said with blessings of the presiding deities of both the shrines, he is confident that the protection and promotion of indigenous Cows will be taken forward. 

Later the Shiridi Sansthan official team visited different departments in Tirumala to see how the activities of darshan, annaprasadam, laddu prasadam distribution etc. Are being executed by TTD in Tirumala following COVID norms.

TTD Board Members, Sri Siva Kumar and Sri Shekar Reddy, Additional EO Sri A V Dharma Reddy, JEO Sri P Basanth Kumar, CVSO Sri Gopinath Jatti, FA and CAO Sri Balaji, Shirdi Samsthan Dy CEO Sri Ravindra Thackeray, Shiridi DSP Sri Somnath and Sub-Divisional Magistrate Sri Govinda Shinde were also present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

టీటీడీ చర్యలు  భేష్

షిర్దీ సంస్థాన్ ప్రశంస

అన్న‌మ‌య్య భ‌వ‌నంలో టిటిడి ఛైర్మ‌న్ అధ్య‌క్ష‌త‌న స‌మావేశం

తిరుమల, 2020 సెప్టెంబరు 26:కోవిడ్ 19 వ్యాప్తి నివారణకు అనేక జాగ్రత్తలు తీసుకుంటూ టీటీడీ భక్తులకు దర్శనం చేయిస్తున్న విధానం చాలా బాగా ఉందని షిర్దీ సంస్థాన్ ప్రతినిధులు ప్రశంసించారు. ఈ ఏర్పాట్లు షిర్దీ లో సాయి బాబా దర్శనం పునఃప్రారంభించడానికి ఎంతో ఉపయోగపడతాయని వారు చెప్పారు.
 
శ‌నివారం తిరుమ‌ల అన్న‌మ‌య్య భ‌వ‌నంలో టిటిడి ఉన్న‌తాధికారులు, షిర్డీ సంస్థాన్ అధికారుల బృందంతో టిటిడి ఛైర్మ‌న్ శ్రీ వైవి సుబ్బారెడ్డి స‌మావేశం నిర్వ‌హించారు.

కరోనా వ్యాప్తి క‌ట్ట‌డికి జాగ్ర‌త్త‌లు తీసుకుంటూ టిటిడి భక్తులకు దర్శనం కల్పించడానికి చేపట్టిన ఏర్పాట్లు, భ‌క్తుల‌కు స‌దుపాయాలు క‌ల్పిస్తున్న తీరును ప‌రిశీలించ‌డానికి శ‌నివారం షిర్డీ సంస్థాన్ అధికారులు తిరుమ‌ల‌కు వ‌చ్చారు. ఈ సంద‌ర్భంగా నిర్వ‌హించిన స‌మావేశంలో కోవిడ్‌-19 ప‌రిస్థితుల్లో తిరుమ‌ల‌లో భ‌క్తుల‌కు క‌ల్పిస్తున్న ద‌ర్శ‌నం, వ‌స‌తి, క్యూలైన్ల నిర్వ‌హ‌ణ‌, అన్న‌దానం, శ్రీ‌వారి సేవ, అకౌంట్స్‌, ల‌డ్డూ ప్ర‌సాదం పంపిణీ కౌంట‌ర్ల నిర్వ‌హ‌ణ‌పై  టీటీడీ అధికారులు ప‌వ‌ర్‌పాయింట్ ప్ర‌జంటేష‌న్ ఇచ్చారు. అలాగే టిటిడి నిర్వ‌హిస్తున్న‌ సామాజిక‌, ధార్మిక కార్య‌క్ర‌మాల‌ను తెలియ‌జేశారు. మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం అనుమ‌తించిన అనంత‌రం షిర్డీలో భ‌క్తుల‌కు ద‌ర్శ‌నం క‌ల్పించ‌డానికి ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోవాల‌నే అంశంపై షిర్డీ శ్రీ సాయిబాబా సంస్థాన్ అధికారులు టిటిడి నుండి సూచనలు, సలహాలు స్వీకరించారు.

ఈ సంద‌ర్భంగా టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్యక్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి మాట్లాడుతూ కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల నిబంధ‌న‌ల మేర‌కు తిరుమ‌ల శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వాలు ఏకాంతంగా, ఎలాంటి లోపాలు లేకుండా ఆచార సంప్ర‌దాయాల ప్ర‌కారం వైభ‌వంగా నిర్వ‌హిస్తున్న‌ట్టు తెలిపారు. షిర్డీ ఆల‌యానికి ఉన్న డిపాజిట్ల‌పై ప్ర‌స్తుత క‌రోనా ప‌రిస్థితుల్లో అధిక వ‌డ్డీ స‌మ‌కూర్చుకునే అవ‌కాశాల‌పై షిర్దీ సంస్థాన్ టిటిడి నుంచి స‌ల‌హాలు స్వీక‌రించింద‌న్నారు. టిటిడి ఆన్‌లైన్‌లో క‌ల్పిస్తున్న ద‌ర్శ‌న టికెట్లు, వ‌స‌తి, విరాళాలు అందించ‌డం లాంటి ఇత‌ర స‌దుపాయాల‌ను షిర్డీ అధికారులు తెలుసుకున్నార‌ని చెప్పారు.

ముఖ్య‌మంత్రి శ్రీ వైఎస్‌.జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఆదేశంతో టిటిడి ద‌క్షిణాది రాష్ట్రాల్లో గుడికో గోమాత కార్య‌క్ర‌మాన్ని ప్ర‌యోగాత్మ‌కంగా ప్రారంభించ‌నుంద‌ని ఛైర్మ‌న్ శ్రీ సుబ్బారెడ్డి షిర్డీ సంస్థాన్ అధికారుల‌కు వివ‌రించారు. త‌మిళ‌నాడులో త్వ‌ర‌లో ఈ కార్య‌క్ర‌మాన్ని ప్రారంభిస్తామ‌న్నారు.

షిర్డీ సంస్థాన్ సిఈవో శ్రీ కె.హ‌రిశ్చంద్ర భ‌గాటే మాట్లాడుతూ తిరుమ‌ల‌లో క్యూలైన్లు, అన్న‌ప్ర‌సాదం, ల‌డ్డూ ప్ర‌సాదం, భ‌ద్ర‌త త‌దిత‌ర అంశాల‌ను త‌మ బృందం ప్ర‌త్య‌క్షంగా ప‌రిశీలించింద‌ని చెప్పారు. టిటిడి అధికారులు ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జంటేష‌న్ ద్వారా వివ‌రించిన అంశాలు షిర్డీ సంస్థాన్‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయ‌న్నారు.

షిర్డీలోనూ గుడికో గోమాత ప్రారంభించండి

టిటిడి అమ‌లుచేయ‌బోతున్న గుడికో గోమాత కార్య‌క్ర‌మం షిర్డీ సంస్థాన్ ఆధ్వ‌ర్యంలో కూడా ప్రారంభించాల‌ని టిటిడి ఛైర్మ‌న్ శ్రీ వైవి.సుబ్బారెడ్డి షిర్డీ సంస్థాన్ సిఈవో శ్రీ కె.హ‌రిశ్చంద్ర భ‌గాటేను కోరారు. ఈ మేర‌కు ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి స‌భ్యుడు శ్రీ శివ‌కుమార్ త‌ర‌ఫున ఆయ‌న విన‌తిప‌త్రం అందించారు. టిటిడి ప్రారంభించ‌నున్న గుడికో గోమాత కార్య‌క్ర‌మానికి షిర్డీ సంస్థాన్ ఒక గోమాత‌ను దానంగా ఇస్తుంద‌ని సిఈవో చెప్పారు. తాము కూడా ఈ కార్య‌క్ర‌మాన్ని అమ‌లు చేయ‌డానికి షిర్డీ సంస్థాన్ పాల‌కమండ‌లితో చ‌ర్చిస్తామ‌న్నారు. శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామి, శ్రీ సాయిబాబా ఆశీస్సుల‌తో గుడికో గోమాత కార్య‌క్ర‌మం విజ‌య‌వంతం కావాల‌ని, గోజాతి ర‌క్షింప‌బ‌డాల‌ని ఆయ‌న ఆకాంక్షించారు. టిటిడి ఛైర్మ‌న్ శ్రీ వైవి.సుబ్బారెడ్డి మాట్లాడుతూ తాను షిర్డీ సంస్థాన్‌కు ఒక గోవును దానంగా అందిస్తాన‌ని చెప్పారు.

ఈ స‌మావేశంలో టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్‌, బోర్డు స‌భ్యులు శ్రీ శివ‌కుమార్‌, శ్రీ శేఖ‌ర్‌రెడ్డి, అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి, జెఈవో శ్రీ పి.బ‌సంత్‌కుమార్‌, సివిఎస్వో శ్రీ గోపినాథ్ జెట్టి, ఎఫ్ఏసిఏవో శ్రీ బాలాజి, షిర్డీ సంస్థాన్ డెప్యూటీ సిఈఓ శ్రీ రవీంద్ర ఠాక‌రే, హెచ్‌డివోలు శ్రీ సోమ‌నాథ్‌, శ్రీ గోవింద్ పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.