JAGGERY AND KIWI FRUIT GARLANDS STEAL THE EVENT _ పటికబెల్లం, కివి పండ్లు, ఎరుపు పవిత్రమాలలతో శోభాయమానంగా స్నపన తిరుమంజనం
TIRUMALA, 13 OCTOBER 2021: The Snapana Tirumanjanam held for the time during the ongoing annual Brahmotsavam at Ranganayakula Mandapam in Tirumala on Wednesday.
The garlands and crown made of jaggery and kiwi fruits added extra flavour and glamour to the divine charm of Sri Malayappa and His Consorts Sridevi and Bhudevi.
Apart from these, the sacred garlands made of red and white silk threads, kuskus, dry fruits were also adorned to the processional deities.
Donors Sri Rajender, Sri Srinivas Sri Sridhar contributed the largesse.
TTD EO Dr KS Jawahar Reddy, Board member Smt Prasanthi Reddy, Additional EO Sri AV Dharma Reddy were also present.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
2021 శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు
పటికబెల్లం, కివి పండ్లు, ఎరుపు పవిత్రమాలలతో శోభాయమానంగా స్నపన తిరుమంజనం
తిరుమల, 2021 అక్టోబరు 13: బ్రహ్మోత్సవాల్లో భాగంగా మొదటిసారిగా పటికబెల్లం, కివిపండ్లు, ఎరువు పవిత్రమాలలతో ప్రత్యేకంగా రూపొందించిన మాలలు, కిరీటాలతో స్నపన తిరుమంజనం శోభాయమానంగా జరిగింది. శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో బుధవారం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారికి వేదమంత్రాల నడుమ కంకణభట్టార్ శ్రీ వాసుదేవ భట్టాచార్యులు ఈ కార్యక్రమం నిర్వహించారు.
దాదాపు రెండు గంటల పాటు జరిగిన స్నపన తిరుమంజనంలో కురువేరు, తెల్లపట్టు, రంగురంగుల ఎండుఫలాలు, వట్టివేరు, పసుపు రోజామాలలను శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారికి అలంకరించారు. వేదపండితులు శ్రీసూక్తం, భూసూక్తం, పురుష సూక్తం, నీలా సూక్తం, నారాయణసూక్తాలను పఠిస్తుండగా అర్చకస్వాములు పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనం తదితర సుగంధ ద్రవ్యాలతో ఉత్సవమూర్తులకు విశేషంగా అభిషేకం చేపట్టారు. శోభాయమానంగా సాగిన ఈ స్నపన తిరుమంజనాన్ని శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేసింది.
తిరుపూర్ కు చెందిన దాత శ్రీ రాజేందర్ సహకారంతో స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక మాలలు, కిరీటాలు, హైదరాబాద్‌కు చెందిన శ్రీ శ్రీనివాస్, శ్రీ శ్రీధర్ సహకారంతో రంగనాయకుల మండపం అలంకరణ చేశామని టిటిడి ఉద్యానవన విభాగం డెప్యూటీ డైరెక్టర్ శ్రీ శ్రీనివాసులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో టిటిడి ఈవో డాక్టర్ కె.ఎస్.జవహర్‌రెడ్డి దంపతులు, అదనపు ఈఓ శ్రీ ఎవి.ధర్మారెడ్డి దంపతులు, బోర్డు సభ్యులు శ్రీమతి ప్రశాంతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.