PADMAVATHI PARINAYOTSAVA MANDAPAM GEARS UP FOR THE CELESTIAL MARRIAGE _ ఫలపుష్ప శోభితం శ్రీపద్మావతి పరిణయోత్సవ మండపం

TEPPAKOLAM SET UP SPRUCED UP FOR THE FIRST TIME

TIRUMALA, 16 MAY 2024: Sri Padmavati Parinayotsava Mandapam spruced up for the first time with “Teppakolam” set up to host the three day celestial wedding ceremony of Sri Srinivasa Padmavathi Parinayotsavam which will begin with splendour from Friday at Narayanagiri Gardens in Tirumala.

Every year, TTD observes this divine wedding ceremony for three days in a grand manner by making splendid arrangements especially to the Mandapam where the celestial marriage of Sridevi Bhudevi sameta Sri Malayappa Swamy is usually celebrated. So far the Garden wing of TTD has set up decorations like, Turmeric-Kunkuma Mandapam, Glass Mandapam, Colour stone Mandapam, Ashtalakshmi Mandapam, Dasavatara Mandapam to impress the devotees. 

For the first time, TTD has erected Teppakolam Mandapam also known as Teppakulam meaning temple tank in the famous ancient temples of Tamilnadu and Kerala states. Besides, the Mandapam is decorated with 15 varieties of 50 thousand cut flowers, two tons of traditional flowers like lilium, roses, crysanthimum etc. The dioramas of Chinni Krishna with Butterball, elephants, horses, musical instruments etc.

According to TTD Garden Deputy Director Sri Srinivasulu, Sri Venkateswara Charitable Trust from Pune has come forward and contributed for the decoration as in previous years. About 50 Gardeners from TTD and 150 Decors from Bengaluru have worked day and night from the last few days, to spruce up the splendid set up.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

ఫలపుష్ప శోభితం శ్రీపద్మావతి పరిణయోత్సవ మండపం

– మొద‌టి సారిగా కేర‌ళ సాంప్ర‌దాయ అలంక‌ర‌ణ‌ ” తెప్ప‌కోలం “

– పరిణయోత్సవాల‌కు ఏర్పాట్లు పూర్తి

తిరుమల, 2024 మే 16: శ్రీపద్మావతి పరిణయోత్సవ మండపాన్ని వివిధ రుచుల ఫలాలు, సువాసనలు వెదజల్లే రంగురంగుల పుష్పాలతో అలంకరించిన మండపంలో తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనంలో శుక్ర‌వారం నుండి శ్రీపద్మావతి పరిణయోత్సవాలు శోభాయమానంగా ప్రారంభమవ్వ‌నున్నాయి. మే 19వ తేదీ వరకు ఈ ఉత్సవాలు అత్యంత వైభ‌వంగా నిర్వ‌హించ‌నున్నారు.

శ్రీ పద్మావతి పరిణయోత్సవ మండపం అలంకరణలకు పెట్టింది పేరు. గతంలో పసుపు-కుంకుమ‌ మండపం, గాజుల మండపం, రంగురాళ్ల మండపం, అష్ట‌ల‌క్ష్మీ మండ‌పం, ద‌శ‌వ‌తార మండ‌పం వంటి నమూనాలతో భ‌క్తుల‌ను విశేషంగా ఆక‌ట్టుకునేలా టీటీడీ ఉద్యానవన విభాగం అలంకరణ చేపట్టింది.

ఈ ఏడాది మొట్ట మొద‌టి సారిగా కేర‌ళ సాంప్ర‌దాయ “తెప్ప కోలం ” అలంక‌ర‌ణతో పాటు ఫలపుష్పాలతో, విద్యుద్దీపాలతో భక్తులను ఆకట్టుకునేలా అలంకరించారు. ఇందులో రోజా, లిల్లీ, చామంతి వంటి రెండు ట‌న్నుల సాంప్ర‌దాయ పుష్పాలు, 50 వేల క‌ట్ ఫ్ల‌వ‌ర్స్ (15 ర‌కాలు), వివిధ ర‌కాల‌ ఫ‌లాలు, ఏనుగులు, గుర్రాలు, చిన్న‌కృష్ణుడు వంటి పెట్టింగుల‌తో సర్వాంగ సుందరంగా అలంకరించారు. మండపం పైభాగంలో ఏర్పాటుచేసిన వెన్న ఉట్లు, వెండి గంటలు, పూల గుత్తులు ఆకట్టుకుంటున్నాయి.

టీటీడీ గార్డెన్‌ విభాగం డెప్యూటీ డైరెక్ట‌ర్‌ శ్రీ శ్రీ‌నివాసులు ప‌ర్య‌వేక్ష‌ణ‌లో బెంగుళూరుకు చెందిన 150 మంది నిపుణులైన అలంక‌ర‌ణ సిబ్బంది, టీటీడీ గార్డెన్ విభాగంకు చెందిన మ‌రో 50 మంది సిబ్బంది గ‌త వారం రోజులుగా శ్రీ ప‌ద్మావ‌తి ప‌రిణ‌యోత్స‌వాల మండ‌పాన్ని రూపొందిస్తున్నారు. ఈ మండప అలంకరణకు పూణేకు చెందిన శ్రీ వేంకటేశ్వర చారిటబుల్‌ ట్రస్టు వారు టీటీడీకి విరాళం అందించారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.