ఫల్స్ఫోలియో చుక్కలు వేసుకోవాలి
ఫల్స్ఫోలియో చుక్కలు వేసుకోవాలి
తిరుపతి, జనవరి -08, 2011: అప్పుడే పుట్టిన చంటి బిడ్డల నుంచి 5 సంవత్సరాలు వయస్సు కలిసిన పిల్లల వరకు ప్రతి ఒక్కరు ఫల్స్ఫోలియో చుక్కలు వేసుకోవాలని తితిదే చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శారద ఒక ప్రకటనలో కోరారు.
జనవరి 10, ఫ్రిబ్రవరి 7వ తేదిలలో ఫల్స్ పోలియో కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు ఆమె చెప్పారు. ఇందుకోసం పై తేదీలలో తిరుమలలో 25 ఫల్స్ పోలియో కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. స్థానికులు, యాత్రికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.