TREMENDOUS RESPONSE FOR LAKSHMI VAIBHAVAM PRAVACHANAS _ ఫాల్గుణ మాసం – లక్ష్మీ వైభవం ప్రవచనాలకు విశేషాదరణ
Tirumala, 22 March 2021: Tremendous response from devotees marked the Lakshmi Vaibhavam pravachanas held at the Nada Niranjanam platform on Monday morning as part of the TTD dharmic agenda of Phalguna Utsava.
Devotees are thronging the Nada Niranjanam platform daily and the live telecast by SVBC has been a major hit with devotees watching the program across the world.
It is well known that the TTD dharmic programs in Karthika, Dhanur, and Magha had hugely reverberated the devotees sentiments. TTD plans to conduct similar programs in Tirupati and Vijayawada during the Phalguna month as well.
The Lakshmi Vaibhavam Pravachanas are being conducted from March 14- April 12. Dr K Ramanuja Charyulu of Dharmagiri Veda vijnan peetham is providing commentary in simple Telugu narrating the significance of each day in the holy Phalguna month.
In the coming days, he is expected to explain the several stages of Asta Lakshmi Vratam, avatars of Sri Lakshmi Devi and incarnation of the Goddess of wealth and prosperity in a simple narrative.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
ఫాల్గుణ మాసం – లక్ష్మీ వైభవం ప్రవచనాలకు విశేషాదరణ
తిరుమల, 2021 మార్చి 22: హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా టిటిడి తలపెట్టిన ఫాల్గుణ మాస ఉత్సవాల్లో భాగంగా తిరుమల నాదనీరాజనం వేదికపై ఉదయం 6 నుండి 6.40 గంటల వరకు నిర్వహిస్తున్న ఫాల్గుణ మాసం – లక్ష్మీ వైభవం ప్రవచనాలకు భక్తుల నుండి విశేషాదరణ లభిస్తోంది. తిరుమలకు వస్తున్న పలువురు భక్తులు నేరుగా ఈ ప్రవచన కార్యక్రమంలో పాల్గొంటున్నారు. శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారు.
టిటిడి ఇదివరకు నిర్వహించిన కార్తీక, ధనుర్, మాఘ మాస ఉత్సవాలకు భక్తుల నుండి విశేష స్పందన లభించింది. ఈ క్రమంలో ఫాల్గుణ మాస ఉత్సవాల్లో భాగంగా తిరుమల, తిరుపతి, విజయవాడలో పలు కార్యక్రమాలు నిర్వహిస్తోంది. మార్చి 14న ప్రారంభమైన ఫాల్గుణ మాసం – లక్ష్మీ వైభవం ప్రవచన కార్యక్రమం ఏప్రిల్ 12వ తేదీ వరకు జరుగనుంది. ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం శాస్త్ర పండితులు డా. కోగంటి రామానుజాచార్యులు ఈ ప్రవచనాలను సరళమైన భాషలో అందరికీ అర్థమయ్యేలా చెబుతున్నారు. ప్రవచనంలో భాగంగా ఫాల్గుణ మాసంలో ఆయా రోజులకు ఉన్న వైశిష్ట్యాన్ని వివరిస్తూ పలు అంశాలను తెలియజేస్తున్నారు. దేవతల తల్లి అయిన అదితి దేవి పయో వ్రతాన్ని ఆచరించి వామనావతారంలో శ్రీమహావిష్ణువును పుత్రునిగా పొందడం, వామనుడు బలిచక్రవర్తిని మూడు అడుగుల స్థలాన్ని కోరడం, శుక్రాచార్యుడు అడ్డు చెప్పడం, ఇచ్చిన మాట కోసం బలి చక్రవర్తి ఆ స్థలాన్ని ఇవ్వడం, పయో వ్రతం ఆచరణ విధానాన్ని ఇప్పటివరకు తెలియజేశారు. రానున్న రోజుల్లో లక్ష్మీ వైభవంలో భాగంగా అష్టలక్ష్మీ వ్రతం, లక్ష్మీదేవి వివిధ అవతారాలు, లక్ష్మీదేవి ఆవిర్భావం తదితర ఘట్టాలను ప్రవచనాల రూపంలో తెలియజేయనున్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.