ALL SET FOR A GRAND LAKSHMI VAIBHOTSAVAM IN TIRUPATI _ ఫాల్గున లక్ష్మీ వైభవం – లక్ష్మీ జయంతికి ఏర్పాట్లు పూర్తి
Tirupati, 27 Mar. 21: TTD has made all arrangements at the Parade Grounds of its Administrative Building for the grand celebrations of Lakshmi Vaibhavam on the occasion of Lakshmi Jayanti on Sunday, March 28 as part of Phalguna Masa Utsavam.
Over 500 women devotees are participating in the unique festival held by TTD in total adherence to Covid guidelines.
As part of preparations, 50 Srivari Sevakulu on Saturday set up high stands for traditional Deepam at the grounds and also drew colourful Rangolis.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
ఫాల్గున లక్ష్మీ వైభవం – లక్ష్మీ జయంతికి ఏర్పాట్లు పూర్తి
తిరుపతి, 2021 మార్చి 27: పవిత్రమైన ఫాల్గున మాసంలో టిటిడి తలపెట్టిన కార్యక్రమాల్లో భాగంగా మార్చి 28న ఆదివారం టిటిడి పరిపాలనా భవనం ప్రాంగణంలోని పరేడ్ మైదానంలో జరుగనున్న ఫాల్గున లక్ష్మీ వైభవం – లక్ష్మీ జయంతికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. సాయంత్రం 6 నుండి రాత్రి 7.45 గంటల వరకు ఈ కార్యక్రమం జరుగనుంది. కోవిడ్ – 19 నిబంధనల మేరకు ఈ కార్యక్రమాన్ని టిటిడి నిర్వహించనుంది.
దాదాపు 500 మంది మహిళలతో లక్ష్మీ జయంతిని టిటిడి నిర్వహించనుంది. ఇందుకోసం శనివారం నాడు 50 మంది శ్రీవారి సేవకులు మైదానంలో దీపపు దిమ్మెలు ఏర్పాటుచేసి, సంప్రదాయబద్ధంగా రంగవల్లులు తీర్చిదిద్దారు.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.