RATHA SAPTHAMI FETE AT TIRUCHANOOR TEMPLE ON FEBRUARY 16 _ ఫిబ్రవరి 16న తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో రథసప్తమి
Tirupati, 27 January 2024: TTD is organising the parade of Sri Padmavati on seven Vahanams on the day of Ratha Sapthami day on February 16 to bless devotees from morning to night.
The vahanas include Surya Prabha, Hamsa, Aswa, Garuda, Chinna Sesha, Chandra Prabha and finally Gaja Vahana.
Earlier in the evening Snapana Tirumanjanam for utsava idol of Sri Padmavati will be held at Sri Krishna Mukha Mandapam.
In view of the fete, TTD has cancelled the arjita Sevas of Lakshmi puja, Kalyanotsavam, kumkumarchana, break Darshan, Unjal Seva and Sahasra Deepalankara Sevas on the day,
Koil Alwar Thirumanjanam on February 13
In view of the Ratha Sapthami fete, the temple cleansing program of Koil Alwar Tirumanjanam will be held on February 13.
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI
ఫిబ్రవరి 16న తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో రథసప్తమి
తిరుపతి, 2024 జనవరి 27: ఫిబ్రవరి 16వ తేదీన రథసప్తమి పర్వదినం సందర్భంగా తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారు ఏడు వాహనాలపై ఊరేగి భక్తులను అనుగ్రహించనున్నారు.
ఉదయం 7.15 నుండి 8.15 గంటల వరకు సూర్యప్రభ వాహనం, ఉదయం 8.45 నుండి 9.45 గంటల వరకు హంస వాహనం, ఉదయం 10.15 నుండి 11.15 గంటల వరకు అశ్వ వాహనం, ఉదయం 11.45 నుండి మధ్యాహ్నం 12.45 గంటల వరకు గరుడ వాహనంపై విహరించి భక్తులను కటాక్షించనున్నారు. మధ్యాహ్నం 1.15 నుండి 2.15 గంటల వరకు చిన్నశేష వాహనం, సాయంత్రం 6 నుండి రాత్రి 7 గంటల వరకు చంద్రప్రభ వాహనం, రాత్రి 8.30 నుండి 9.30 గంటల వరకు గజ వాహనంపై దర్శనమిస్తారు.
కాగా సాయంత్రం 3.30 నుండి 4.30 గంటల వరకు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలోని శ్రీ కృష్ణస్వామివారి ముఖ మండపంలో అమ్మవారి ఉత్సవర్లకు స్నపనతిరుమంజనం వైభవంగా నిర్వహిస్తారు.
ఈసందర్భంగా అమ్మవారి ఆలయంలో నిర్వహించే లక్ష్మీపూజ, ఆర్జిత కల్యాణోత్సవం, కుంకుమార్చన, బ్రేక్ దర్శనం, ఊంజలసేవ, సహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది.
తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం పక్కన గల శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయంలో ఉదయం 6 నుండి 7 గంటల వరకు స్వామివారు అశ్వవాహనాన్ని అధిష్టించి భక్తులకు దర్శనమివ్వనున్నారు.
ఫిబ్రవరి 13న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
శ్రీ పద్మావతీ అమ్మవారి ఆలయంలో రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఫిబ్రవరి 13వ తేదీ ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.