RATHASAPTAMI AT KRT ON FEBRUARY 16 _ ఫిబ్రవరి 16న శ్రీ కోదండరామాలయంలో రథసప్తమి

Tirupati, 11 February 2024: Rathasaptami festival will be celebrated on February 16 in Sri Kodanda Ramaswamy temple in Tirupati.

It is customary to organize Rathasaptami festivals in the local temples of TTD to celebrate Surya Jayanti on Magha Shuddha Saptami every year. 

On that morning, devotees eagerly wait to see the wonderful sight of the first rays of the Sun radiating on the Lord’s forehead, navel and lotus feet on the Surya Prabha Vahanam.

In the temple of Sri Kodandarama Swamy, devotees witness Lord on seven different Vahanams from morning to evening.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

ఫిబ్రవరి 16న శ్రీ కోదండరామాలయంలో రథసప్తమి

తిరుపతి, 2024 ఫిబ్రవరి 11: తిరుపతి శ్రీ కోదండ రామస్వామివారి ఆలయంలో ఫిబ్రవరి 16న రథసప్తమి పర్వదినాన్ని వైభవంగా నిర్వహించనున్నారు.

ప్రతి సంవత్సరం మాఘ శుద్ధ సప్తమి సూర్యజయంతిని పురస్కరించుకొని టీటీడీ స్థానిక ఆలయాల్లో రథసప్తమి ఉత్సవాలను నిర్వహించడం ఆనవాయితీ. ఆరోజు ఉదయం భానుని కిరణాలు సూర్యప్రభ వాహనంలో కొలువైన స్వామివారి లలాటపలకం, నాభి, పాదకమలాలపై ప్రసరించే అద్భుత దృశ్యాన్ని తిలకించడానికి భక్తులు వేయికళ్లతో ఎదురుచూస్తుంటారు.

శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో ఉదయం 7 గంటలకు సూర్యప్రభవాహనం, రాత్రి 7 గంటలకు చంద్రప్రభ వాహనంపై స్వామివారు విహరించి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.