SRI GOVINDARAJA SWAMY TEPPOTSAVAMS _ ఫిబ్ర‌వ‌రి 17 నుండి 23వ తేదీ వ‌ర‌కు శ్రీ గోవిందరాజస్వామివారి తెప్పోత్సవాలు

Tirupati, 15 February 2024: The annual Teppotsavam will be held from February 17 to 23 at Sri Govindaraja Swamy temple in Tirupati.

For seven days, from 6.30 pm to 8 pm, the Swamy varu along with His Consorts will ride on floats in the Pushkarini.

The Lord in the guise of Sri Kodandarama Swamy on February 17, Sri Parthasarathy Swamy along with Sri Rukmini and Satyabhama on February 19, Sri Kalyana Venkateswara Swamy on February 20, Sri Krishna Swamy with Andal Ammavaru on 20, and Sri Govindaraja Swamy on  21, 22 and 23. 

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

ఫిబ్ర‌వ‌రి 17 నుండి 23వ తేదీ వ‌ర‌కు శ్రీ గోవిందరాజస్వామివారి తెప్పోత్సవాలు
 
తిరుప‌తి, 2024, ఫిబ్ర‌వ‌రి 15: తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఫిబ్ర‌వ‌రి 17 నుండి 23వ తేదీ వ‌ర‌కు  తెప్పోత్సవాలు జ‌రుగ‌నున్నాయి. 
 
ఏడు రోజుల పాటు సాయంత్రం 6.30 నుండి రాత్రి 8 గంటల వరకు స్వామివారు దేవేరులతో కలిసి శ్రీ గోవింద‌రాజ పుష్క‌రిణిలో తెప్పల‌పై విహరిస్తారు. ఆ త‌రువాత ఆలయ మాడ వీధుల్లో ఊరేగి భక్తులను అనుగ్రహిస్తారు. ఫిబ్ర‌వ‌రి 17న శ్రీ కోదండరామస్వామివారు, 18న శ్రీ రుక్మిణి, స‌త్య‌భామ స‌మేత శ్రీ పార్థసారథిస్వామివారు, 19న శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారు, 20న ఆండాళ్‌ అమ్మవారితో కలిసి శ్రీకృష్ణస్వామివారు, 21, 22, 23వ తేదీల్లో శ్రీ గోవిందరాజస్వామివారు తెప్పల‌పై భక్తులకు కనువిందు చేయ‌నున్నారు. చివ‌రి రోజు తెప్పోత్స‌వం అనంత‌రం ఎదురు ఆంజ‌నేయ‌స్వామివారి స‌న్నిధికి స్వామివారు వేంచేపు చేస్తారు.
 
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.