ఫిబ్రవరి 23 నుండి మార్చి 4వ తేది వరకు శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో వార్షిక మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు
ఫిబ్రవరి 23 నుండి మార్చి 4వ తేది వరకు శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో వార్షిక మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు
తిరుపతి, ఫిబ్రవరి -16, 2011: తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో వార్షిక మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 23 నుండి మార్చి 4వ తేది వరకు వేడుకగా నిర్వహిస్తామని తితిదే కార్యనిర్వహణాధికారి శ్రీ ఐ.వై.ఆర్. కృష్ణారావు చెప్పారు. బుధవారం ఉదయం ఆయన శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి, తిరుపతిలోని శ్రీకపిలేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలకు సంబంధించిన పోస్టర్లను, ఆహ్వాన పత్రికలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఇఓ మాట్లాడుతూ అంకురార్పణం ఫిబ్రవరి 22వ తేదిన నిర్వహిస్తామని, అదేవిధంగా ఏకాంత ఉత్సవాలు మార్చి 5 నుండి 7వ తేది వరకు మూడు రోజులపాటు ఘనంగా నిర్వహిస్తామని ఆయన తెలిపారు. మార్చి 3వ తేది ఆలయంలో కల్యాణోత్సవం నిర్వహిస్తారు. ఈ కల్యాణోత్సవంలో పాల్గొన దలచిన గృహస్థులు రు.250/-లు చెల్లించాల్సివుంటుంది.
శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలలో భాగంగా రోజువారి వాహనసేవలు ఈ విధంగా వున్నాయి.
తేది ఉదయం సాయంత్రం
23-02-2011 ధ్వజారోహణం(ఉ.9-24 నిమిషాలకు మీనలగ్నం) హంస వాహనం
24-02-2011 సూర్యప్రభ వాహనం చంద్రప్రభ వాహనం
25-02-2011 భూత వాహనం సింహ వాహనం
26-02-2011 మకర వాహనం శేష వాహనం
27-02-2011 అధికారనంది వాహనం తిరుచ్చి ఉత్సవం
28-02-2011 వ్యాఘ్ర వాహనం గజ వాహనం
01-03-2011 కల్పవృక్ష వాహనం తిరుచ్చి ఉత్సవం
02-03-2011 రథోత్సవం(భోగితేరు) నంది వాహనం
03-03-2011 పురుషామృగ వాహనం అశ్వ వాహనం
04-03-2011 నటరాజస్వామి సూర్యప్రభవాహనం ధ్వజావరోహణం(సా.6-00 నుండి7.30 గంటల వరకు), రావణాసుర వాహనం (రా.8-00 నుండి9.30 గంటల వరకు)
బ్రహ్మోత్సవాల సందర్భంగా పైరెండు ఆలయాల్లో తితిదే ధర్మప్రచారపరిషత్ దాససాహిత్య, అన్నమాచార్య ప్రాజెక్ట్‌ల ఆధ్వర్యంలో సాంస్కృతిక, సంగీత, భజన కార్యక్రమాలు నిర్వహిస్తారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.