BTU OF SRINIVASA MANGAPURAM TEMPLE FROM FEBRUARY 29 – MARCH 8 _ ఫిబ్రవరి 29 నుండి మార్చి 8వ తేదీ వరకు శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు
Tirupati,10 February 2024: TTD is organising the annual Brahmotsavam of Sri Kalyana Venkateswara Swamy temple, Srinivasa Mangapuram from February 29-March 8 with Ankurarpanam fete on February 28.
As part of celebrations daily Vahana Sevas were conducted between 8am and 9am and again between 7pm and 8pm.
Dwajarohanam will be held in Meena lagnam on February 29. Important days include Garuda Vahanam on February
5, Rathotsavam on February 7, Chakra Snanam and Dwajaavarohanam on February 8.
Ahead of Brahmotsavam the customary fete of Koil Alwar Tirumanjanam will be observed on February 22 between 6am and 10am.
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI
ఫిబ్రవరి 29 నుండి మార్చి 8వ తేదీ వరకు శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు
తిరుపతి, 2024 ఫిబ్రవరి 10: శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఫిబ్రవరి 29 నుండి మార్చి 8వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఫిబ్రవరి 28వ తేదీ సాయంత్రం అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి.
ఉదయం 8 నుండి 9 గంటల వరకు, రాత్రి 7 నుండి 8 గంటల వరకు వాహనసేవలు నిర్వహిస్తారు.
బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :
తేదీ
29-02-2024
ఉదయం – ధ్వజారోహణం(మీనలగ్నం) రాత్రి – పెద్దశేష వాహనం
01-03-2024
ఉదయం – చిన్నశేష వాహనం రాత్రి – హంస వాహనం
02-03-2024
ఉదయం – సింహ వాహనం రాత్రి – ముత్యపుపందిరి వాహనం
03-03-2024
ఉదయం – కల్పవృక్ష వాహనం రాత్రి – సర్వభూపాల వాహనం
04-03-2024
ఉదయం – పల్లకీ ఉత్సవం(మోహినీ అవతారం) రాత్రి – గరుడ వాహనం
05-03-2024
ఉదయం – హనుమంత వాహనం సాయంత్రం – స్వర్ణరథం, రాత్రి – గజ వాహనం
06-03-2024
ఉదయం – సూర్యప్రభ వాహనం రాత్రి – చంద్రప్రభ వాహనం
07-03-2024
ఉదయం – రథోత్సవం రాత్రి – అశ్వవాహనం
08-03-2024
ఉదయం – చక్రస్నానం రాత్రి – ధ్వజావరోహణం
ఫిబ్రవరి 22న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఫిబ్రవరి 22వ తేదీ ఉదయం 6 నుండి 10 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగనుంది. బ్రహ్మోత్సవాల ముందు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.