ఫిబ్రవరి 3వ తేది నుండి 9వ తేది వరకు శ్రీ గోవిందరాజస్వామివారి తెప్పోత్సవాలు

ఫిబ్రవరి 3వ తేది నుండి 9వ తేది వరకు శ్రీ గోవిందరాజస్వామివారి తెప్పోత్సవాలు

తిరుపతి, జనవరి-27,2009: తిరుపతిలోని శ్రీగోవిందరాజస్వామివారి తెప్పోత్సవాలు ఫిబ్రవరి 3వ తేది నుండి 9వ తేది వరకు 7 రోజుల పాటు కన్నుల పండుగగా నిర్వహిస్తారు.

ఈసందర్భంగా ఫిబ్రవరి 3వ తేదిన శ్రీకోదండరామస్వామివారు, ఫిబ్రవరి 4వ తేదిన శ్రీపార్థసారధి స్వామివారు, ఫిబ్రవరి 5వ తేదిన శ్రీ కల్యాణవేంకటేశ్వర స్వామి వారు, ఫిబ్రవరి 6వ తేదిన శ్రీకృష్ణస్వామి, శ్రీ అండాళ్‌ అమ్మవారు, ఫిబ్రవరి 7,8,9వ తేదిలలో శ్రీగోవిందరాజస్వామివార్లు తెప్పలపై విహరిస్తూ భక్తులకు కనువిందైన దర్శనమిస్తారు.

ఈ సందర్భంగా ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్ట్‌ ఆధ్వర్యంలో సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.