DHARMIC SADAS FROM FEBRUARY 3-5 _ ఫిబ్రవరి 3 నుండి 5 వరకు శ్రీ వేంకటేశ్వర ధార్మిక సదస్సు

Tirumala, 20 January 2024: Sri Venkateswara Dharmic Conference will be held from February 3 to 5 at Asthanamandapam in Tirumala under the auspices of TTD.

Swamijis of various Mutts and Hindu religious heads from all over the country and representatives of like-minded organizations will attend this conference. 

TTD has formed a committee with senior officials to conduct the conference in smooth manner. 

The officials in this committee supervise the arrangements related to their respective tasks.

ISSUED BY TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
ఫిబ్రవరి 3 నుండి 5 వరకు శ్రీ వేంకటేశ్వర ధార్మిక సదస్సు
 
తిరుమల, 20 జ‌న‌వ‌రి, 2024: టీటీడీ ఆధ్వర్యంలో తిరుమలలోని ఆస్థానమండపంలో ఫిబ్రవరి 3 నుండి 5వ తేదీ వరకు శ్రీ వేంకటేశ్వర ధార్మిక సదస్సు జరుగనుంది.
 
దేశవ్యాప్తంగా గల మఠాలు, పీఠాలకు చెందిన స్వామీజీలతోపాటు భావసారూప్యం గల సంస్థల ప్రతినిధులు ఈ సదస్సుకు విచ్చేయనున్నారు. ఈ సదస్సును సజావుగా నిర్వహించేందుకు సీనియర్ అధికారులతో టీటీడీ ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఆయా పీఠాధిపతులు,  మఠాధిపతులు, స్వామీజీలకు సంబంధించిన ఏర్పాట్లను ఈ కమిటీలోని అధికారులు పర్యవేక్షిస్తారు.
 
టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.