STUDENT SUCCESS MEET ON FEBRUARY 9 _ ఫిబ్రవరి 9న విద్యార్థుల సక్సెస్ మీట్

ACHIEVER AWARDS FOR MERITORIOUS STUDENTS IN VARIOUS FIELDS

Tirupati, 08 February 2024: A Student Success Meet will be held at Mahathi Auditorium in Tirupati on February 9 at 2 PM to felicitate the students who have shown outstanding talent belonging to various TTD institutions and encourage them with Achiever Awards.

On this occasion, 240  students who have excelled in academics, NCC, NSS, sports and games, cultural, co-curricular, competitive exams etc. in TTD-run educational institutions will be presented with 5 gram silver dollar and presented with a Certificate of Appreciation. 

It is remarkable that TTD educational institutions are organizing such a program to recognize the talent of students and inspire other students.  Arrangements for this event are being made under the direction of TTD DEO Dr. M. Bhaskar Reddy.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

ఫిబ్రవరి 9న విద్యార్థుల సక్సెస్ మీట్

•⁠ ⁠వివిధ అంశాల్లో ప్రతిభ కనబరిచినవారికి అఛీవర్ అవార్డులు

ఫిబ్రవరి 08, తిరుపతి, 2024: టీటీడీ విద్యాసంస్థల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థినీ విద్యార్థులను అభినందించి అఛీవర్ అవార్డులు ప్రదానం చేసేందుకు ఫిబ్రవరి 9వ తేదీ శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం 2 గంటలకు తిరుపతి మహతి ఆడిటోరియంలో విద్యార్థుల‌ సక్సెస్ మీట్ జ‌రుగ‌నుంది.

టీటీడీ విద్యాసంస్థల్లో అకడమిక్స్, ఎన్.సి.సి, ఎన్ఎస్ఎస్, స్పోర్ట్స్ అండ్ గేమ్స్, కల్చరల్, కో కరికులర్, కాంపిటీటివ్ ఎగ్జామ్స్ తదితర అంశాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 240 మంది విద్యార్థిని విద్యార్థులకు ఈ సందర్భంగా 5 గ్రాముల వెండి డాల‌ర్‌, ప్రశంసాపత్రం అందజేస్తారు. విద్యార్థుల ప్రతిభను గుర్తించి ఇతర విద్యార్థుల్లో స్ఫూర్తిని నింపేందుకు టీటీడీ విద్యాసంస్థలు ఇలాంటి కార్యక్రమం నిర్వహిస్తుండడం విశేషం. విద్యాశాఖ అధికారి డా.ఎం.భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో ఇందుకోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.