5th CONVOCATION OF SV VEDIC UNIVERSITY ON FEB 20 _ ఫిబ్రవరి 20న ఎస్వీ వేద వర్సిటీ 5వ స్నాతకోత్సవం
Tirupati, 18 Feb. 20: His Excellency the Governor of Andhra Pradesh Sri Viswabushan Harichandan and union minister for Micro, Small and Medium Enterprise Sri Pratap Chandra Sarangi will participate in the Fifth convocation of the SV Veda University on February 20 in Tirupati.
In this event to be organised at the university Yagashala, about 200 Degree graduates, 104 Master Degree and Two M Phil and Five PhD Doctorates will be presented certificates.
Similarly Brahmarshi Maddulapalli Suryanarayana Ghanapati of Tirupati will be conferred the title “Maha Mahopadhyaya”. The Union minister Sri Sarangi and Pundit Sri Chaganti Prakash Rao of Visakhapatnam will be presented with “Vachaspati” awards
The students who brought laurels to the university in the national sports, Cultural programs and also in research programs will also be honoured with citations.
All arrangements for the convocation were supervised by SV Veda University Vice chancellor Acharya Sannidhanam Sudarshan Sharma.
ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI
ఫిబ్రవరి 20న ఎస్వీ వేద వర్సిటీ 5వ స్నాతకోత్సవం
తిరుపతి, 2020 ఫిబ్రవరి 18:తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం 5వ స్నాతకోత్సవం ఫిబ్రవరి 20వ తేదీన జరుగనుంది. రాష్ట్ర గవర్నరు శ్రీ బిశ్వభూషణ్ హరిచందన్ అధ్యక్షతన జరుగనున్న ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రివర్యులు శ్రీ ప్రతాప్‌చంద్ర సారంగి పాల్గొంటారు.
గురువారం మధ్యాహ్నం 2.30 గంటలకు వర్సిటీ ప్రాంగణంలోని యాగశాలలో స్నాతకోత్సవం నిర్వహిస్తారు. ఇందులో 2017, జూలై 13 నుండి 2019, జూలై 31 వరకు ఉత్తీర్ణులైన 200 మందికి బ్యాచిలర్స్ డిగ్రీ, 104 మందికి మాస్టర్ డిగ్రీ, ఇద్దరికి ఎంఫిల్, ఐదుగురికి పిహెచ్‌డి పట్టాలు ప్రదానం చేస్తారు. అదేవిధంగా, తిరుపతికి చెందిన వేదపండితుడు బ్రహ్మశ్రీ మద్దులపల్లి సూర్యనారాయణ ఘనాపాఠికి మహామహోపాధ్యాయ పురస్కారం, కేంద్రమంత్రివర్యులు, సంస్కృత పండితులైన శ్రీ ప్రతాప్‌చంద్ర సారంగికి, విశాఖపట్నంకు చెందిన శాస్త్ర పండితుడు శ్రీ చాగంటి ప్రకాశరావుకు వాచస్పతి పురస్కారాలు అందజేస్తారు. జాతీయస్థాయిలో క్రీడలు, సాంస్కృతిక అంశాలు, పరిశోధనాపత్రాలు పొంది ఉత్తమ ప్రదర్శన కనబరిచిన విద్యార్థులకు ప్రశంసాపత్రాలు అందిస్తారు. ఎస్వీ వేద వర్సిటీ వైస్ చాన్సలర్ ఆచార్య సన్నిధానం సుదర్శనశర్మ పర్యవేక్షణలో ఈ స్నాతకోత్సవం ఏర్పాట్లు జరుగుతున్నాయి.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.