ONLINE MARCH QUOTA OF SED AND SSD TO RELEASE ON FEBRUARY 23 _ ఫిబ్రవరి 23న ప్రత్యేక ప్రవేశ దర్శనం, సర్వదర్శనం టోకెన్ల అదనపు కోటా విడుదల
RELEASE OF ADDITIONAL FEB QUOTA OF SED IN ONLINE ON FEB 23
Tirumala, 22 February 2022: TTD will release an additional quota of 13,000 tickets per day of SED tickets from 24-28 February on February 23.
Similarly, an additional offline quota of SSD tokens at 5000 per day for February 26- 28 will be issued at regular counters of Bhudevi complex, Srinivasam complex, Sri Govindaraja Swamy Choultries.
Apart from this, the online quota of Rs. 300 tickets at 25,000 per day for the month of March will also be released on February 23 at 9am.
TTD has also decided to release 20000 offline tokens every day at SSD tokens issuing counters in Tirupati.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI
ఫిబ్రవరి 23న ప్రత్యేక ప్రవేశ దర్శనం, సర్వదర్శనం టోకెన్ల అదనపు కోటా విడుదల
ఫిబ్రవరి 23న మార్చి నెల కోటా విడుదల
తిరుమల, 22 ఫిబ్రవరి 2022: శ్రీవారి దర్శనానికి సంబంధించి ఫిబ్రవరి 24 నుండి 28వ తేదీ వరకు అదనంగా రోజుకు 13,000 చొప్పున రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను ఫిబ్రవరి 23వ తేదీ బుధవారం నుండి టిటిడి ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచనుంది.
అదేవిధంగా, ఫిబ్రవరి 26 నుండి 28వ తేదీ వరకు అదనంగా రోజుకు 5,000 చొప్పున సర్వదర్శనం టోకెన్లను ఆఫ్‌లైన్‌లో తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం కాంప్లెక్స్, శ్రీ గోవిందరాజస్వామి సత్రాల్లో ఏర్పాటుచేసిన కౌంటర్లలో భక్తులకు కేటాయిస్తారు.
కాగా, మార్చి నెలకు సంబంధించి రోజుకు 25 వేలు చొప్పున రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటాను ఫిబ్రవరి 23న ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు.
అదేవిధంగా, మార్చి నెలకు సంబంధించి రోజుకు 20 వేలు చొప్పున సర్వదర్శనం టోకెన్లు ఆఫ్‌లైన్‌లో తిరుపతిలోని కౌంటర్ల ద్వారా కేటాయిస్తారు.
టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.