BIRRD PLANS 25 COCHLEAR IMPLANTS PER MONTH- TTD CHAIRMAN _ బర్డ్‌లో నెలకు 25 కాక్లియర్‌ ఇంప్లాంట్‌ సర్జరీలకు ప్రణాళికలు – టీటీడీ ఛైర్మన్‌ శ్రీ వైవి.సుబ్బారెడ్డి

SUCCESSFUL SURGERIES ON 10 CHILDREN IN TWO DAYS

 

Tirupati, 07 July 2023: TTD Chairman Sri YV Subba Reddy on Friday said that BIRRD hospital is gearing up to conduct 25 cochlear implant surgeries per month.

 

He interacted with a few children who underwent cochlear implants on Friday morning and gave some suggestions to hospital staff and doctors.

 

Speaking to media persons along with the EO Sri AV Dharma Reddy, JEO (H&E) Smt Sada Bhargavi and OSD BIRRD Dr Reddappa Reddy, the Chairman said TTD launched the cochlear implant programs for children with hearing difficulties n 2022 upon the directives of the Honourable CM of AP Sri YS Jaganmohan Reddy.

 

Began with one such surgery per month has now expanded to 10 surgeries with the blessings of Lord Venkateswara and the dedicated services of expert doctors, he maintained.

 

He said in the next two days 10 such implants operations will be conducted by the expert team of doctors from Apollo Hospital, Hyderabad viz. Dr EC Vinay Kumar, Dr Rambabu  and surgeries costing ₹7-14 lakhs each will be performed free to the ailing infants.

 

He said nearly 120 children have been registered at the TTDs Shravanam project for cochlear implant surgeries who will be operated in a phased manner.

 

Similarly, on advice of the CM of AP, 46 cleft palate operations on children in coordination with Smile Train organisation were performed so far since May last in BIRRD. Arrangements are being made for similar operations in the coming days.

 

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDS, TIRUPATI

బర్డ్‌లో నెలకు 25 కాక్లియర్‌ ఇంప్లాంట్‌ సర్జరీలకు ప్రణాళికలు

– రెండు రోజుల్లో 10 మంది పిల్లలకు విజయవంతంగా సర్జరీలు

– టీటీడీ ఛైర్మన్‌ శ్రీ వైవి.సుబ్బారెడ్డి

తిరుపతి, 2023 జూలై 07: వినికిడి లోపంతో బాధ పడుతున్న చిన్నారులకు బర్డ్‌ ఆసుపత్రిలో రాబోయే రోజుల్లో నెలకు 25 కాక్లియర్‌ ఇంప్లాంట్‌ సర్జరీలు ఉచితంగా నిర్వహించడానికి ప్రణాళికలు సిద్ధం చేశామని టీటీడీ ఛైర్మన్‌ శ్రీ వైవి.సుబ్బారెడ్డి తెలిపారు. తిరుపతిలోని బర్డ్‌ ఆసుపత్రిలో శుక్రవారం కాక్లియర్‌ ఇంప్లాంట్‌ సర్జరీలు చేసుకున్న పిల్లలతో ఛైర్మన్‌ మాట్లాడారు. అనంతరం ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి, జేఈవో శ్రీమతి సదా భార్గవి, ప్రత్యేకాధికారి డాక్టర్‌ రాచపల్లె రెడ్డెప్పరెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.

వినికిడి లోపంతో బాధపడుతున్నవారికి శ్రీవారి ఆశీస్సులతో కొత్త జీవితం ప్రసాదించాలనే సదాశయంతో గత ఏడాది మేలో ముఖ్యమంత్రివర్యులు శ్రీవైఎస్‌.జగన్మోహన్‌ రెడ్డి బర్డ్‌లో కాక్లియర్‌ ఇంప్లాంట్‌ సర్జరీలు చేసే కార్యక్రమాన్ని ప్రారంభించారని తెలిపారు. మొదట నెలకు ఒక సర్జరీతో ప్రారంభమైన ఈ ప్రయత్నం తరువాత నెలకు మూడు దాకా చేసే స్థాయికి చేరుకుందన్నారు. ఆతరువాత స్వామివారి ఆశీస్సులు, వైద్యుల కృషితో కొద్ది కాలంలోనే నెలకు 10 సర్జరీలు చేసే స్థాయికి చేరుకుందని వివరించారు. ఇందులో భాగంగానే రెండు రోజుల్లో 10 మంది పిల్లలకు సర్జరీలు చేసి వారికి కొత్త జీవితాన్ని ప్రసాదించినట్టు చెప్పారు. హైదరాబాద్‌ అపోలో ఆసుపత్రికి చెందిన ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్‌ ఈసి వినయ్‌ కుమార్‌, డాక్టర్‌ రాంబాబు నేతృత్వంలో ఈ సర్జరీలు నిర్వహించారన్నారు. రూ.7 లక్షల నుండి రూ.14 లక్షల వరకు ఖర్చయ్యే ఈ ఆపరేషన్లు ఉచితంగా నిర్వహిస్తున్నట్టు తెలియజేశారు.

టీటీడీ నిర్వహిస్తున్న శ్రవణం ప్రాజెక్టులో సుమారు 120 మంది పిల్లలు కాక్లియర్‌ ఇంప్లాంట్‌ సర్జరీ కోసం పేర్లు నమోదు చేసుకున్నారని, దశలవారీగా వీరందరితో పాటు ఇతరులకు కూడా ఉచితంగా ఆపరేషన్లు నిర్వహిస్తామని తెలిపారు. అదేవిధంగా, గత ఏడాది మేలో ముఖ్యమంత్రివర్యులు శ్రీ వైఎస్‌.జగన్మోహన్‌ రెడ్డి స్మైల్‌ ట్రైన్‌ సంస్థ సహకారంతో బర్డ్‌లో ఉచితంగా గ్రహణమొర్రి సర్జరీలు చేసే కార్యక్రమాన్ని ప్రారంభించారని చెప్పారు. ఇప్పటివరకు 48 మందికి విజయవంతంగా ఈ సర్జరీలు చేశారని, రాబోయే రోజుల్లో మరిన్ని సర్జరీలు చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తామని వెల్లడించారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.