ENQUIRY ON BUS ACCIDENT- TTD CHAIRMAN _ బస్సు ప్రమాదం పై విచారణ-టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి

CONCRETE RETAINING WALL IN DOWN GHAT ROADA

 

Tirupati, 23 May 2023: TTD Chairman Sri YV Subba Reddy directed officials to conduct enquiry on the bus accident that occurred on Wednesday on the Tirumala Tirupati down ghat road and submit a detailed report on the same. 

 

TTD Chairman on Thursday visited the site where the bus mishap happened and reviewed the issues connected with the accident. 

 

Speaking to the media later he said the Olectra company and RTC officials had informed that there was no technical fault but over speeding and human error shall be probed. 

 

The Chairman said fortunately with the benign blessings of Sri Venkateswara Swamy none of devotees injured and RTC made all alternative arrangements ensuing safe transportation of passengers to Tirupati.

 

He said officials concerned have been instructed to give more training to drivers on electric buses and ensure safety of passengers.

 

TTD CVSO Sri Narasimha Kishore, Transport GM Sri Shesha Reddy, RTC RM Sri Chengal Reddy, Olectra electric bus manufacturing company representatives were present. 

 

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

బస్సు ప్రమాదం పై విచారణ

– డౌన్ ఘాట్ రోడ్డులో కూడా కాంక్రీట్ రీటైనింగ్ వాల్ నిర్మాణం

టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి

తిరుపతి 25 మే 2023: తిరుమల – తిరుపతి ఘాట్ రోడ్డులో బుధవారం జరిగిన బస్సు ప్రమాదంపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి అధికారులను ఆదేశించారు. డౌన్ ఘాట్ రోడ్డులో కూడా కాంక్రీట్ తో రీటైనింగ్ వాల్ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

ఘాట్ రోడ్డు లో బస్సు ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని గురువారం చైర్మన్ శ్రీవైవి సుబ్బారెడ్డి పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరు, ఇందుకు దారి తీసిన కారణాలు ఏమై ఉండొచ్చు అనే అంశాలపై ఆయన అధికారులతో చర్చించారు.

ఈ సందర్బంగా శ్రీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడారు. బస్సు లో సాంకేతిక ఇబ్బందులేమీ లేవని ఓలెక్ట్రా సంస్థ ప్రతినిధులు, ఆర్టీసీ అధికారులు సమాచారం ఇచ్చారన్నారు. అతి వేగం లేదా డ్రైవర్ నిర్లక్ష్యం ప్రమాదానికి కారణమై ఉండొచ్చని, దీని పై విచారణ జరపాలని అధికారులను ఆదేశించామని చెప్పారు. శ్రీ వేంకటేశ్వర స్వామి దయ వల్ల బస్సులోని ప్రయాణీకులెవరికీ పెద్ద గాయాలు కాలేదన్నారు. తిరుమలకు వచ్చిన భక్తులను క్షేమంగా తిరుపతికి చేర్చడానికి టీటీడీ అన్ని భద్రతా చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ఇలాంటి ప్రమాదాలు మరోసారి జరక్కుండా చర్యలు తీసుకోవాలని, అవసరమైతే విద్యుత్ బస్సుల డ్రైవర్లకు మరోసారి శిక్షణ ఇప్పించాలని చైర్మన్ సూచించారు.

టీటీడీ సివిఎస్వో శ్రీ నరసింహ కిషోర్, రవాణా విభాగం జిఎం శ్రీ శేషారెడ్డి, ఆర్టీసీ ఆర్ ఎం శ్రీ చెంగల్ రెడ్డి, ఓలెక్ట్రా విద్యుత్ బస్సుల తయారీ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది