బెంగళూరులో ఐఏఎస్‌ల శిక్షణకు వెళ్లిన తితిదే తిరుపతి జెఇఓ

బెంగళూరులో ఐఏఎస్‌ల శిక్షణకు వెళ్లిన తితిదే తిరుపతి జెఇఓ

తిరుపతి, జనవరి 06, 2013: తితిదే తిరుపతి సంయుక్త కార్యనిర్వహణాధికారి శ్రీ పి.వెంకట్రామిరెడ్డి ఐఏఎస్‌ల శిక్షణ కార్యక్రమం నిమిత్తం ఆదివారం బెంగళూరుకు బయల్దేరి వెళ్లారు.
 
బెంగళూరులోని ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌(ఐఐఎం)లో జనవరి 7 నుండి 11వ తేదీ వరకు ఐదు రోజుల పాటు ఈ శిక్షణ కార్యక్రమం ఉంటుంది. ఇందులో ”మేనేజ్‌మెంట్‌ ఆఫ్‌ డెలివరింగ్‌ ఆఫ్‌ సర్వీస్‌ ఇన్‌ గవర్నమెంట్‌ ఫర్‌ ఐఏఎస్‌ ఆఫీసర్స్‌” అనే అంశంపై శిక్షణ ఇవ్వనున్నారు. పర్సనల్‌ అండ్‌ పబ్లిక్‌ గ్రీవెన్సెస్‌ మంత్రిత్వ శాఖ ఈ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.
 
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.