TIRUPATI ORIGIN DAY OBSERVED ON PAR WITH ANNUAL BRAHMOTSAVAMS – TTD CHAIRMAN _ బ్ర‌హ్మోత్స‌వాల‌ను త‌ల‌పించిన‌ మన తిరుపతి 894వ ఆవిర్భావ వేడుకలు

TTD FULL SUPPORT FOR TIRUPATI DEVELOPMENT -EO

TIRUPATI VIBRATED WITH GOVINDA NAMA

Tirupati, 24 February 2024: The 894th Origin Day of the Pilgrim City of Tirupati will be henceforth celebrated by TTD in a grand manner on par with the annual Brahmotsavam, said TTD Chairman Sri Bhumana Karunakara Reddy.

During the Formation day celebrations of Tirupati on Saturday at Sri Govindaraja Swamy temple premises the TTD Board Chief said 

the temple city was named as Govindarajapuram and the foundation was laid on 24-2-1130 by Jagadguru Sri Sri Sri Ramanujacharya.

He said TTD Board had decided to celebrate the day on February 24 and as part of TTD calendar of events every year. He said the ancient historical cities like Mesopotamia, Lashkar, Nippar hace vanished and cultures of Athens, Rome and Mayan disappeared along with the time. But it is only for Tirupati, the credit of celebrating the day of Origin goes sound with the benign blessings of Srivaru and we are all fortunate to be denizens of this great city.

Speaking on the occasion the TTD EO Sri AV Dharma Reddy said steps are being taken to spiritually beautify Tirupati on par with Tirumala as devotees pass through Tirupati on way to Tirumala for Srivari Darshan. Assuring that TTD will support all development activities in Tirupati.

Thrilling Shobha Yatra

The grand Shobha Yatra began from Sri Govindarajaswami temple after special pujas in which hundreds of artists of HDPP, Annamacharya and Dasa Sahitya projects participated singing Govinda Nama, Chakka bhajans,kolatam besides Veda pundits chanting Bhakti Chaitanya shlokas.

Major attraction were artists adorned in the guise of Devatas and mythological characters. 

Tirumala Pontiffs Sri Sri Sri Sri Pedda Jeeyar swami and Sri Sri Sri Sri Chinna Jeeyar swami, MP Sri Gurumurthy, Collector Sri Lakshmi Sha,MLC Sri C.Subramanyam, JEO Sri Veerabrahmam,

SP Smt Malika Garg, Mayor Dr Shirisha, Deputy Mayor Sri Bhumana Abhinay Reddy, FA & CAO Sri  Balaji, CE Sri Nageswara Rao, CPRO Sri Ravi were also present.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

బ్ర‌హ్మోత్స‌వాల‌ను త‌ల‌పించిన‌ మన తిరుపతి 894వ ఆవిర్భావ వేడుకలు

– తిరుపతి పుట్టిన రోజు వేడుకను టీటీడీ క్యాలెండర్‌లో భాగం చేస్తాం

– టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి

– తిరుపతి అభివృద్ధికి టీటీడీ సంపూర్ణ సహకారం

– టీటీడీ ఈవో ఎవి ధర్మారెడ్డి

– గోవింద నామ స్మరణలతో పులకించిన తిరునగరి

తిరుపతి, 24 ఫిబ్రవరి 2024: తిరుమ‌ల శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వాల‌ను త‌ల‌పించేలా మన తిరుపతి 894వ ఆవిర్భావ వేడుకలను టీటీడీ ఆధ్వ‌ర్యంలో అంగ‌రంగ వైభ‌వంగా నిర్వ‌హించిన‌ట్లు ఛైర్మ‌న్ శ్రీ భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డి తెలిపారు. తిరుప‌తి శ్రీ గోవింద‌రాజ‌స్వామివారి ఆల‌య ప్రాంగ‌ణంలో శ‌నివారం ఉద‌యం ఛైర్మ‌న్ ఈ ఉత్స‌వాల‌ను ప్రారంభించారు.

ఈ సంద‌ర్భంగా ఛైర్మ‌న్ మాట్లాడుతూ, జగద్గురువు శ్రీ‌శ్రీ‌శ్రీ రామానుజాచార్యులు తన అమృత హస్తాలతో 24.02.1130 న శంకుస్థాపన చేయడంతో పాటు గోవిందరాజపురంగా నామకరణ చేయగా, నేడు తిరుపతిగా భాసిల్లుతున్నద‌న్నారు. ఇక నుంచి ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 24న సాంప్రదాయంగా, ఆచారంగా తిరుపతి పుట్టిన రోజు వేడుకను టీటీడీ క్యాలెండర్ లో భాగం చేస్తూ, పాలక మండలిలో తీర్మానించ‌నున్న‌ట్లు ఛైర్మ‌న్ తెలిపారు. తిరుమ‌ల శ్రీ‌వారి ఆశీస్సులతోనే ఈ పండుగను ఇంత అద్భుతంగా నిర్వహించుకుంటున్న‌ట్లు చెప్పారు.

ఇందులో వేద పండితుల వేద ఘోష, కళాకారుల అద్భుత విన్యాసాలతో తిరుపతిలో కూడా బ్రహ్మోత్సవాలు జరుగుతాయనేలా మైమ‌రిపించార‌న్నారు. టీటీడీ యంత్రాంగమంతా కదలివచ్చి మన తిరుపతి పుణ్యక్షేత్ర ఆవిర్భావ వేడుకలు అంగరంగ వైభవంగా నభూతో న భవిష్యత్ అనేలా నిర్వ‌హించింద‌న్నారు. ఈ కార్యక్రమ విజయానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. తిరుప‌తి న‌గ‌రం ప్రపంచానికి ఓ ఆదర్శ నగరం కావాలని ఆకాంక్షించారు.

అనంత‌రం టీటీడీ ఈవో ఎవి ధర్మారెడ్డి మాట్లాడుతూ, ప్రపంచ నలుమూలల నుంచి శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి తిరుపతి మీదుగా తిరుమలకు వెళ్తార‌న్నారు. కావున భ‌క్తుల‌కు మ‌రింత ఆధ్యాత్మిక ఆనంద‌న్ని క‌లిగించేందుకు తిరుపతి నగరాన్ని కూడా తిరుమల తరహాలో సుందరంగా తీర్చిదిద్దేలా చర్యలు చేపట్టడం జరిగింద‌న్నారు. తిరుపతి అభివృద్ధికి టీటీడీ సంపూర్ణ సహకారం అందిస్తోంద‌న్నారు. తిరుపతి అభివృద్ధికి అందరూ సహకరించాలని, అందుకోసమే టీటీడీ పాలక మండలి కృషి చేస్తోంద‌న్నారు. మన తిరుపతి ఆవిర్భావ దినోత్సవాన్ని మూడోసారి నిర్వహించు కుంటున్న తరుణంలో పుర‌ప్ర‌జ‌ల‌కు, శ్రీ‌వారి భ‌క్తుల‌కు ఈవో శుభాకాంక్షలు తెలియజేశారు.

అలరించిన ఆధ్యాత్మిక శోభా యాత్ర –

అంత‌కుముందు ఛైర్మ‌న్ శ్రీగోవిందరాజ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, శోభాయాత్రను ప్రారంభించారు. టీటీడీ డిపిపి, అన్న‌మాచార్య ప్రాజెక్టు, దాస సాహిత్య ప్రాజెక్టుకు చెందిన వంద‌లాది మంది క‌ళాకారులు చెక్క భజనలు, కోలాటాలతో లయబద్ధంగా ఆడుతూ, గోవింద నామ సంకీర్తనలు, వేదపండితులు మంత్రోచ్చారణల మ‌ధ్య భక్తి చైతన్య యాత్ర జ‌రిగింది. అదేవిధంగా క‌ళాకారుల వివిధ దేవ‌తామూర్తుల, పౌరాణిక వేషధారణలు పుర‌ప్ర‌జ‌ల‌ను విశేషంగా ఆకర్షించాయి.

ఈ కార్య‌క్ర‌మంలో తిరుమ‌ల శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద జియ‌ర్ స్వామి, శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న జీయ‌ర్ స్వామి, పార్ల‌మెంటు సభ్యులు శ్రీ గురుమూర్తి, జిల్లా క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీ షా, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం, టీటీడీ జేఈవో వీరబ్రహ్మం, ఎస్పీ శ్రీ‌మ‌తి మ‌ల్లిక గ‌ర్గ్‌, నగర మేయర్ డాక్ట‌ర్ శిరీష, నగర డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి, ఎఫ్ ఎ అండ్ సిఎవో శ్రీ బాలాజి, సిఇ శ్రీ నాగేశ్వ‌ర‌రావు త‌దిత‌రులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.