GAGUNDRA MANDAPAM OCCUPIES A SPECIAL PLACE _ బ్రహ్మోత్సవాల్లో శ్రీ పద్మావతి అమ్మవారి నైవేద్యానికి ఆవాసం గంగుండ్రమండపం

Tiruchanoor, 25 Nov. 19: The Gagundra mandapam, with a 151 year devotional history is utilised as venue of daily naivedyam and rest after vahana sevas -twice a day – particularly during Brahmotsavams and other festivals of Sri Padmavathi Ammavaru at Tiruchanoor.

The mandapam adjacent to Padma Sarovar near Sri Padmavathi Ammavari Temple at Tiruchanoor was erected in 1868 by Sri S Venkataranga Iyengar, then Tahsildar of Tirupati-Tirumala appointed by the British government. His descendants even today come to Tiruchanoor during Brahmotsavams, Teppotsavam etc. For serving Goddess Padmavathi.

They have also set up a charity society to take dharmic and poor feeding activities during events.

Sri S Venkataranga charity society led by his descendants took up Vyramadi utsavam and other festivities at Melkote town in Mandya district of Karnataka every year at the Chaluva Narayanaswamy temple through the Vanamamalai Mutt.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI 

పత్రికా ప్రకటన                                           తిరుపతి, 2019 నవంబరు 25

శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల ప్రత్యేక వ్యాసం

 బ్రహ్మోత్సవాల్లో శ్రీ పద్మావతి అమ్మవారి నైవేద్యానికి ఆవాసం గంగుండ్రమండపం

 తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలలో ప్రతి రోజు ఉదయం, సాయంత్రం వాహనసేవల్లో సిరుల తల్లికి విశ్రాంతి, నైవేద్యానికి ఆవాసం గంగుండ్ర మండపం. ఈ మండపానికి దాదాపు 151 సంవత్సరాల పురాతనమైన చరిత్ర వుంది.

తిరుచానూరులోని అమ్మవారి ఆలయానికి ప్రక్కన, పద్మ సరోవరానికి ఎదురుగా వున్న గంగుండ్ర మండపాన్ని 1868వ సంవత్సరంలో శ్రీ ఎస్‌.వెంకటరంగ అయ్యంగార్‌ నిర్మించారు. ఈయన బ్రిటిష్‌ ప్రభుత్వంలో తహశీల్ధార్‌గా తిరుమల, తిరుపతి పరిసర ప్రాంతాలలో పని చేశారు. అమ్మవారిపై  భక్తితో గంగుండ్ర మండపాన్ని నిర్మించారు. ఆనాటి నుండి నేటి వరకు ఆయన వంశస్థులు అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో, తెప్పోత్పవాల్లో తిరుచానూరు విచ్చేసి అమ్మవారిని సేవిస్తున్నారు. శ్రీ ఎస్‌.వెంకటరంగ అయ్యంగార్‌  చారిటి సొసైటిని ఏర్పాటు చేసి అనేక దార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

కర్ణాటక రాష్ట్రంలోని మాండ్యం జిల్లా మేలుకొటైలో కొలువై వున్న చలువ నారాయణస్వామి ఆలయంలో ప్రతి సంవత్సరం వైరమడి ఉత్సవం నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలకు విచ్చేసే వేలాది మంది భక్తులకు శ్రీ ఎస్‌.వెంకటరంగ అయ్యంగార్‌ చారిటి సొసైటి వారు వానమామాలై మఠంలో అన్నప్రసాదాలు అందిస్తూ అనేక ధార్మిక కార్యక్రమాలను చారిటి తరపున ఆయన వంశస్థులు నిర్వహిస్తున్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.