TTD ARRANGES LUGGAGE COUNTERS OPPOSITE SRIVARI SEVA FOR NAVARATRI BRAHMOTSAVAMS _ బ్ర‌హ్మోత్స‌వాల్లో శ్రీ‌వారి సేవా స‌ద‌న్ ఎదురుగా ల‌గేజి కౌంట‌ర్లు ఏర్పాటు

NO PERMISSION TO TWO-WHEELERS TO PLY ON GHAT ROADS ON GARUDA SEVA DAY

TIRUMALA, 13 OCTOBER 2023: For depositing luggage and mobiles of devotees coming for Navaratri brahmotsavams from October 15-23, TTD has set up additional luggage counters in front of Srivari Seva Sadan in Tirumala.

 

There are luggage counters already at  GNC, TBC and PAC-4 but the PAC-4 counter will not function during the Brahmotsavams keeping in view the heavy influx of pilgrims and vehicular traffic. As an alternative measure, TTD has temporarily shut down PAC4 luggage counter and opened up three additional counters opposite Seva Sadan and one adjacent to the Octopus building. 

 

TTD appealed to devotees to use these facilities which are arranged for the convenience of the pilgrims during brahmotsavams.

 

On the day of Garuda seva on October 19, in view of huge traffic on Ghat roads, TTD has cancelled the movement of two-wheelers on that day. The devotees are requested to observe the above changes and co-operate with TTD.

 
ISSUED BY THE PUBLIC RELATION OFFICER

బ్ర‌హ్మోత్స‌వాల్లో శ్రీ‌వారి సేవా స‌ద‌న్ ఎదురుగా ల‌గేజి కౌంట‌ర్లు ఏర్పాటు

– అక్టోబ‌రు 19న గ‌రుడసేవ‌నాడు ఘాట్ రోడ్ల‌లో ద్విచ‌క్ర వాహ‌నాల ర‌ద్దు

తిరుమ‌ల‌, 2023 అక్టోబ‌రు 13: తిరుమ‌ల శ్రీ‌వారి న‌వ‌రాత్రి బ్ర‌హ్మోత్స‌వాలు అక్టోబ‌రు 15 నుండి 23వ తేదీ వ‌ర‌కు జ‌రుగ‌నున్నాయి. బ్ర‌హ్మోత్స‌వాల్లో శ్రీ‌వారి ద‌ర్శ‌నార్థం వ‌చ్చే భ‌క్తులు ల‌గేజి, సెల్‌ఫోన్లు భ‌ద్ర‌ప‌ర‌చుకునేందుకు తిరుమ‌ల‌లోని శ్రీ‌వారి సేవా స‌ద‌న్ ఎదురుగా అద‌నంగా ల‌గేజి కౌంట‌ర్లు ఏర్పాటు చేశారు.

తిరుమ‌ల‌లో జిఎన్‌సి, టిబిసి, పిఏసి-4 వ‌ద్ద ల‌గేజి కౌంట‌ర్లు ఉన్నాయి. బ్ర‌హ్మోత్స‌వాల స‌మ‌యంలో భ‌క్తుల ర‌ద్దీ ఎక్కువ‌గా ఉండ‌డం, వాహ‌నాల ర‌ద్దీ పెరిగే అవ‌కాశం ఉండ‌డంతో భ‌క్తులకు ఇబ్బందులు త‌లెత్త‌కుండా పిఏసి-4 ల‌గేజి కౌంట‌రును తాత్కాలికంగా మూసి వేశారు. వీరి సౌక‌ర్యార్థం వ‌రాహ‌స్వామి విశ్రాంతి గృహాల‌కు ఎదురుగా, క‌ల్యాణ‌వేదిక వెనుక‌వైపు గ‌ల శ్రీ‌వారి సేవాస‌ద‌న్ ఎదురుగా విశాల‌మైన ప్రాంతంలో అద‌నంగా 3 ల‌గేజి కౌంట‌ర్లు ఏర్పాటు చేశారు. శ్రీ‌వారి ద‌ర్శ‌నానంత‌రం ఆల‌యం నుండి వెలుప‌లికి వ‌చ్చే భ‌క్తులు, వెంగ‌మాంబ అన్న‌ప్ర‌సాదం కాంప్లెక్స్‌లో అన్న‌ప్ర‌సాదాలు స్వీక‌రించిన భ‌క్తులు స‌మీపంలో ఉన్న శ్రీ‌వారి సేవా స‌ద‌న్ ఎదురుగా గ‌ల కౌంట‌ర్ల‌లో ల‌గేజి, సెల్‌ఫోన్లు పొందే అవ‌కాశ‌ముంది. భ‌క్తులు ఈ సౌక‌ర్యాన్ని వినియోగించుకోవాల‌ని కోర‌డ‌మైన‌ది.

బ్ర‌హ్మోత్స‌వాల్లో భాగంగా అక్టోబ‌రు 19న గ‌రుడ సేవ నాడు తిరుమ‌ల‌-తిరుప‌తి ఘాట్ రోడ్ల‌లో వాహ‌నాల ర‌ద్దీ ఎక్కువ‌గా ఉండ‌డం వ‌ల్ల ట్రాఫిక్ స‌మ‌స్య త‌లెత్త‌కుండా ద్విచ‌క్ర వాహ‌నాల రాక‌పోక‌ల‌ను టీటీడీ ర‌ద్దు చేసింది. భ‌క్తులు ఈ విష‌యాన్ని గ‌మ‌నించి టీటీడీకి స‌హ‌క‌రించాల‌ని కోర‌డ‌మైన‌ది.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.