Matrusri Tarigonda Vengamamba 280th Jayanthi Celebrations held at Tirumala _ భక్తిభావం ద్వారానే మానవులు మోక్షాణ్ణి పొందగలరు -విశాఖ శారదా పీఠాధిపతులు శ్రీ స్వరూపానంద సరస్వతి
Sri Sri Sri Swaroopananda Swami, Dr. Medasani Mohan, Director Vengamamba Project and others paid floral tributes to the tomb of Matrusri Tarigonda Vengamamba at Tirumala.
భక్తిభావం ద్వారానే మానవులు మోక్షాణ్ణి పొందగలరు – విశాఖ శారదా పీఠాధిపతులు శ్రీ స్వరూపానంద సరస్వతి
తిరుమల, 2010 మే 26: భక్తిభావం ద్వారానే మానవులు మోక్షాణ్ణి పొందగలరని విశాఖ శారదా పీఠాధిపతులు శ్రీ స్వరూపానంద సరస్వతి అన్నారు.
మాతృశ్రీతరిగొండ వెంగమాంబ 280వ జయంతి ఉత్సవాలు బుధవారం ఉదయం తిరుమలలోని శ్రీ నారాయణగిరి ఉద్యానవనంలోని పద్మావతి పరియణోత్సవ మండపంలో ఘనంగా జరిగాయి.
శ్రీ మలయప్పస్వామివారు ఉభయనాంచారులతో కలసి వెంగమాంబ జయంతి ఉత్సవాలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులు వెంగమాంబ కృతులను ఆలపించి భక్తులను రంజింప చేసారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన విశాఖశారధాపీఠాధిపతులు శ్రీ స్వరూపానంద సరస్వతి స్వాములవారు మాట్లాడుతూ అన్నమాచార్యుల తర్వాత అంతగొప్పగా మలయప్ప స్వామివారిని కీర్తించదగిన భక్తకవయిత్రి శ్రీతరిగొండవెంగమాంబ అనికొనియాడారు. వెంగమాంబ ఏడవ ఏటనే ఆమె తల్లిదండ్రులు బాల్యవివాహం చేసారని కొద్దికాలంలోనే ఆమె భర్త మరణించడంతో అప్పటి నుండి వెంగమాంబ శ్రీ వేంకటేశ్వరస్వామివారిని భర్తగా భావించి ఆమె స్వస్థలమైన తరిగొండ నుంచి కాలినడకన తిరుమల చేరుకొని శ్రీనివాసున్ని స్తుతిస్తూ అనేక కీర్తనలను రచించారని తెలియచేసారు. వెంగమాంబ శ్రీవారినే కీర్తిస్తూ సజీవ సమాది పొందారని అన్నారు.
అనంతరం తిరుమలలోని శ్రీ తరిగొండవెంగమాంబ సమాధివద్ద శ్రీ స్వరూపానంద స్వామివారు ప్రత్యేక పూజలను నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో అన్నమాచార్య ప్రాజెక్టు డైరక్టర్ మోడసాని మోహన్, వెంగమాంబ రచనల పరిష్కర్త కె.జి. కృష్ణమూర్తి ఇతర తితిదే అధికారులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.