భక్తులకు టీటీడీ విజ్ఞప్తి దూర ప్రాంతాల భక్తులు మీ ప్రాంతంలోనే ఆన్ లైన్ లో దర్శనం టిక్కెట్లు పొందండి- టీటీడీ

భక్తులకు టీటీడీ విజ్ఞప్తి

దూర ప్రాంతాల భక్తులు మీ ప్రాంతంలోనే ఆన్ లైన్ లో దర్శనం టిక్కెట్లు పొందండి- టీటీడీ

తిరుమల, 2020 జూన్ 13: తిరుమల శ్రీవారి దర్శనానికి ప్రతిరోజు మూడు వేల పైచిలుకు సమయ నిర్దేశిత సర్వ దర్శనం టోకెన్లను టీటీడీ తిరుపతిలోని విష్ణు నివాసం శ్రీనివాసo, అలిపిరి వద్ద గల భూదేవి కాంప్లెక్స్ నందు భక్తులకు ఇస్తున్నది. ఇప్పటికే ఈనెల 18వ తేది వరకు ఉన్న కోటాకు పూర్తిగా టోకెన్లు ఇవ్వడం జరిగింది.

అయితే దూర ప్రాంతాల నుండి భక్తులు తిరుపతికి వచ్చి ఇక్కడి కౌంటర్లలో టికెట్లు పొందిన వారు, వారి దర్శనం తేదీ వచ్చే వరకు తిరుపతి లోనే బస ఉండి తమకు టైం స్లాట్ టోకెన్లు వచ్చిన తేదీలలో దర్శనానికి వెళ్తున్నారని తెలిసినది. ఈ క్రమంలో కొందరు భక్తులు తిరుపతిలోనే రెండు మూడు రోజులు ఉండిపోతున్నారని సమాచారం.

దూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులు ఇక్కడ ఇబ్బందులు పడకుండా, వారి ప్రాంతాల నుండే ఆన్ లైన్ ద్వారా దర్శనం టోకెన్లు పొందవలసిందిగా టీటీడీ విజ్ఞప్తి చేస్తున్నది.

తి. తి. దే. ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది

content