TIRUMALA MUSEUM TO PROVIDE DIVINE FEEL TO DEVOTEES – TTD EO _ భక్తులకు దివ్యానుభూతి కల్పించేలా తిరుమల మ్యూజియం అభివృద్ధి – అధికారులకు ఈవో శ్రీ ఎవి ధర్మారెడ్డి ఆదేశం

TIRUMALA, 14 JUNE 2023: The Sri Venkateswara Museum at Tirumala should be developed in such a way that it provides a divine feel to the multitude of visiting pilgrims and devotees who throng the Hill temple, said TTD EO Sri AV Dharma Reddy to the officers concerned.

A review meeting on the development activities of the SV Museum was held by EO in his chambers in TTD Administrative Building in Tirupati on Wednesday. During the meeting, the EO discussed on the upcoming structures in the Museum which includes different galleries dedicated for the History and significance of Tirumala, the Glory of Sri Venkateswara Swamy, ardent devotees who sanctified their lives in the service of Sri Venkateswara, jewels of Srivaru etc. He also said, there should be three floors and each one should have four blocks. 

TCS Officials Sri Bheema Sekhar and Sri Ranjan has given a presentation on the various gallery and zone concepts with all the amenities to be provisioned within the museum, also Bengaluru-based MAP Systems India Pvt. Ltd. representative Sri Sharan has given a PowerPoint presentation showcasing the details pertaining to the various displays in different galleries. On the Ground floor, Netra Darshanam of Srivaru, Sri Balaji Gallery, Sculpture, coins etc. will be arranged while in the First Floor Architecture, history of emperors, musical instruments, information to pilgrims will be put on display while in the second floor, expo on Sanatana Hindu Dharma, out galleries will be arranged and in the third floor a theme will be set up narrating the process of how the protector Sri Maha Vishnu is ruling and guarding the entire cosmos

The EO also suggested the concerned to design the staircase in such a way keeping in view the aged and handicapped also. He also instructed to keep ready fire safety measures, reception counters etc. and asked the concerned to complete the works by this December and bring the Museum to the pilgrim utility from January next onwards. 

New Delhi Museum retired Director General Sri AKVS Reddy, Karnataka Museum Advisor Prof.Raghavendra Kulkarni, expert Sri Saratchandra, Hyderabad Salarjung Museum Director Dr Nagendra Reddy, SV Museum Special Officer Sri Krishna Reddy, TTD officials, representatives from TCS were also present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

భక్తులకు దివ్యానుభూతి కల్పించేలా తిరుమల మ్యూజియం అభివృద్ధి – అధికారులకు ఈవో శ్రీ ఎవి ధర్మారెడ్డి ఆదేశం

తిరుమల 14 జూన్ 2023: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు మరో దివ్యానుభూతి కల్పించేలా మ్యూజియం ను తయారు చేయాలని టీటీడీ ఈవో శ్రీ ఎవి ధర్మారెడ్డి అధికారులను ఆదేశించారు.

టీటీడీ పరిపాలన భవనంలోని తన చాంబర్ లో బుధవారం ఆయన తిరుమల మ్యూజియం అభివృద్ధి పనులపై సమీక్ష జరిపారు.

మ్యూజియంలో ఏర్పాటు చేయదలచిన తిరుమల క్షేత్ర ప్రాశస్త్యం, స్వామి వైభవం, భక్త శిఖామణులు, శ్రీవారి ఆభరణాల గురించి చర్చించారు. మ్యూజియం లో గ్రౌండ్ ఫ్లోర్ కాకుండా మూడు ఫ్లోర్ లు ఏర్పాటు చేయాలని చెప్పారు. ఒక్కో ఫ్లోర్ లో నాలుగు బ్లాక్ లు ఉండాలన్నారు. గ్రౌండ్ ఫ్లోర్ లో స్వామివారి నేత్ర దర్శనం, శ్రీబాలాజి గ్యాలరీ, శిల్ప కల, కాయిన్స్ గ్యాలరీలు ఉండేలా ఢిల్లీకి చెందిన ఎడిపి కంపెనీ ప్రతినిధి శ్రీ రంజన్ , బెంగుళూరుకు చెందిన మ్యాప్ కంపెనీ ప్రతినిధి శ్రీ శరన్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ఇందులో మొదటి ఫ్లోర్ లో ఆర్కిటెక్చర్ గ్యాలరీ, పరిపాలకులు వారి చరిత్ర , సంగీత పరికరాలు, భక్తుల సమాచారంకు సంబంధించిన అంశాలు ఉంటాయి. రెండవ ఫ్లోర్ లో హిందూ ధర్మం, ఔటర్ గ్యాలరీలు ఉంటాయి. మూడవ ఫ్లోర్ లో శ్రీమహావిష్ణువు సమస్త లోకాలను ఏ విధంగా పాలిస్తున్నారో తెలిపేలా తయారు చేసిన డిజైన్లను ఈవో చూశారు.

మ్యూజియంలో స్టెయిర్ కేస్, వృద్ధులు, వికలాంగులు కూర్చోవడానికి, అగ్ని ప్రమాదాలను ఎదుర్కునే యంత్రాలు, రిసెప్షన్ ఏర్పాట్లు కూడా ఉండాలని ఈవో సూచించారు. ఈ ఏడాది డిసెంబరు నాటికి మ్యూజియం పనులు పూర్తి చేసి జనవరి నుంచి భక్తులకు అందుబాటులోకి తెచ్చేలా చర్యలు తీసుకోవాలని ఈవో అధికారులను ఆదేశించారు.
న్యూ ఢిల్లీ నేషనల్ మ్యూజియం విశ్రాంత డైరెక్టర్ జనరల్ శ్రీ ఎ కె వి ఎస్ రెడ్డి, కర్ణాటక మ్యూజియం సలహాదారు ప్రొఫెసర్ రాఘవేంద్ర కులకర్ణి, మ్యూజియం నిపుణులు శ్రీ శరత్ చంద్ర, హైదరాబాద్ సాలార్జంగ్ మ్యూజియం డైరెక్టర్ డాక్టర్ నాగేంద్ర రెడ్డి, ఎస్వి మ్యూజియం ప్రత్యేకాధికారి శ్రీ కృష్ణా రెడ్డి తో పాటు పలువురు టీటీడీ అధికారులు, టీ సి ఎస్ ప్రతినిధులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది