భక్తులకు విజ్ఞప్తి

భక్తులకు విజ్ఞప్తి

 తిరుమల, 2010 జూలై 24 : తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని జూలై 17వ తేది నుండి ఆగష్టు 31 వ తేది వరకు శ్రీవారి పుష్కరిణికి మరమ్మత్తులు చేస్తారు.

ప్రతి ఏడాది శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ముందు శ్రీవారి పుష్కరిణిని శుభ్రపరుస్తారు. ఈ క్రమంలో ఈ నెల 17వ తేది నుండి ఆగష్టు 31 వ తేది వరకు 45 రోజుల పాటు పుష్కరిణికి మరమ్మత్తులు చేస్తారు. భక్తులు స్నానమాచరించడానికి పుష్కరిణికి పడమర దిక్కున ప్రత్యేక నీటి పంపులను ఏర్పాటు చేసారు. భక్తులు ఈ మార్పును గమనించగలరు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.