COMFORTABLE SRIVARI DARSHAN TO DEVOTEES IS OUR CORE PURPOSE- TTD EO _ భ‌క్తుల‌కు సౌక‌ర్య‌వంత‌మైన ద‌ర్శ‌నం క‌ల్పించ‌డ‌మే మ‌న‌ ధ్యేయం : స్వాతంత్ర్య దినోత్స‌వ వేడుకల్లో టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి

  • WANT DEVOTEES TO GO HOME WITH SWEET MEMORIES OF TIRUMALA
  • TTD EO AT INDEPENDENCE DAY CELEBRATIONS

Tirumala, August 15, 2023:  TTD EO Sri AV Dharma Reddy said on Tuesday that TTD employees should provide dedicated service so that devotees from across the world go back with sweet memories of Tirumala after comfortable Srivari Darshan and savouring Anna Prasadam.

TTD EO hoisted the national flag at Tirumala as part of the 77th Independence Day celebrations at Gokulashtami Rest house 

Speaking on the occasion He said now Srivari Hundi collections were safely carried to the brand new Parakamani Bhavan and the erstwhile Parakamani Mandapam inside Srivari temple used by devotees for offering prayers.

TTD EO said to make parakamani functions more effective TTD has plans to induct coins separation machines, and currency counting equipment and almost two lakh persons are savouring Anna Prasadam every day.

He said five more rest houses were built under the leasing system and all the old rest houses ( built 40 years ago) were being renovated at ₹120 crore cost with modern amenities.

Among others he said PAC five is built at ₹100 crores to provide shelter to 10,000 more devotees, Divya Darshan tokens from April 1 on Alipiri footpath route, string safety measures against wild beasts attack on footpaths.

He lauded the employees of Health, Anna Prasadam, vigilance Kalyana Katta and reception for their excellent service to devotees inspite of the massive rush without respite.

SE-2 Sri Jagdeeswar Reddy, VGOs Sri Bali Reddy’s, Sri Giridhar, DyEOs Sri Loganathan, Sri Bhaskar, Sri Selvam, Sri Rajendra, EE Sri Surendra Reddy, DE Electrical Sri Ravi Shankar Reddy, AVSOs and others were present.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

భ‌క్తుల‌కు సౌక‌ర్య‌వంత‌మైన ద‌ర్శ‌నం క‌ల్పించ‌డ‌మే మ‌న‌ ధ్యేయం :

– ప్రతి భక్తుడు మధుర స్మృతులతో తిరిగి వెళ్లాలి

– స్వాతంత్ర్య దినోత్స‌వ వేడుకల్లో టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి

తిరుమల, 2023 ఆగ‌స్టు 15: భక్తులే మా ఆరాధ్యదైవం అంటూ టీటీడీ ఉద్యోగులు అంకితభావంతో యాత్రికులకు సౌక‌ర్య‌వంత‌మైన సేవలందించాల‌ని ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి అన్నారు. తిరుమ‌ల గోకులం విశ్రాంతి గృహం ఆవరణలో మంగ‌ళ‌వారం ఉద‌యం 77వ స్వాతంత్ర్య దినోత్స‌వ‌ వేడుకల్లో పాల్గొన్న ఈవో జాతీయ జెండాను ఎగురవేసి వందనం చేశారు.

ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, ప్ర‌పంచం న‌లుమూలల‌ నుండి శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి విచ్చేసే భ‌క్తుల‌కు టీటీడీ ఉద్యోగులు అంకితభావంతో మ‌రింత మెరుగైన సేవ‌లందించి, ప్రతి భక్తుడు మధుర స్మృతులతో తిరిగి వెళ్లేలా చూడాలని పిలుపునిచ్చారు. శ్రీవారికి భక్తులు సమర్పించిన హుండీ కానుకలను లెక్కించేందుకు ఆల‌యం వెలుప‌ల నూతన పరకామణి భవనాన్ని అత్యాధునిక భద్రతతో ఏర్పాటుు చేసినట్లు చెప్పారు. శ్రీ‌వారి అనుగ్ర‌హంతో హుండీల‌ను సుల‌భంగా పరకామణి భవనంలోనికి త‌ర‌లిస్తున్న‌ట్లు తెలిపారు. ఇదివరకు ఆల‌యం లోప‌ల ప‌ర‌కామ‌ణి నిర్వ‌హిస్తున్న మండ‌పంలో వేలాది మంది భ‌క్తులు కూర్చుని స్వామివారిని ప్రార్థిస్తున్నార‌న్నారు. పరకామణిని మరింత సులభతరం చేసేందుకు కాయిన్స్ వేరుచేసే మిష‌న్‌, క‌రెన్సీ కౌంటింగ్‌, ప్యాకింగ్ మిష‌న్లు త్వ‌ర‌లోనే వ‌స్తాయ‌న్నారు. టీటీడీ అన్న‌దానం ట్ర‌స్టు ద్వారా ప్ర‌తి రోజు 2 ల‌క్ష‌ల మందికి పైగా భ‌క్తుల‌కు అన్న‌ప్ర‌సాదాలు అందిస్తున్నామ‌న్నారు. 1985వ సంత్స‌రంలో రెండు వేల మందితో ప్రారంభ‌మైన ఈ కార్య‌క్ర‌మం ఈ రోజు ఎంత‌మందికైన ప్రసాదాలు అందించేందుకు సిద్ధంగా ఉందన్నారు.

తిరుమ‌ల‌లో అతిథి గృహాల స్థ‌లం లీజుకు ఇచ్చే కార్యక్రమం ద్వారా ఐదు అతిథి గృహా ల నిర్మాణం పూర్తి చేసి భక్తులకు అందుబాటులోనికి తీసుకు వచ్చినట్లు తెలిపారు. తిరుమ‌ల‌లో వసతి గదులు నిర్మించి దాదాపు 40 సంవత్సరాలు అయ్యిందని రూ.120 కోట్లతో భక్తులకు అవసరమైన అత్యాధునిక సౌకర్యాలతో వీటిని ఆధునీకరించినట్లు తెలిపారు. తిరుమలలో మరో 10 వేల మంది శ్రీవారి భక్తులకు వసతి సౌకర్యాన్ని కల్పించేందుకు రూ.100 కోట్లతో పిఏసి 5 నిర్మాణం ప్రారంభించినట్లు చెప్పారు. ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుండి అలిపిరి శ్రీవారి మెట్టు మార్గాలలో నడిచి వెళ్లే భక్తులకు దివ్యదర్శనం టోకెన్లు జారీ చేసే ప్రక్రియ ప్రారంభించామన్నారు. నడక మార్గాల్లో క్రూరమృగాల వల్ల భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.

తిరుమలలో యాత్రికుల రద్దీ అధికంగా ఉంద‌న్నారు. అన్నప్రసాదం, ఆరోగ్యం, విజిలెన్స్, కల్యాణ కట్ట, రిసెప్షన్ మరియు ఆలయ విభాగాల ఉద్యోగులు అద్భుతంగా సేవలు అందిస్తున్నార‌ని చెప్పారు.

ఎస్ఈ – 2 శ్రీ జగదీశ్వర్‌రెడ్డి, విజివోలు శ్రీ బాలిరెడ్డి, శ్రీ గిరిధర్, డెప్యూటీ ఈవోలు శ్రీ లోకనాథం, శ్రీ భాస్కర్, శ్రీ సెల్వం, శ్రీ రాజేంద్ర, ఈఈ శ్రీ సురేందర్ రెడ్డి, డిఇ ఎలక్ట్రికల్ శ్రీ రవిశంకర్ రెడ్డి, ఏవీఎస్ఓలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది