భక్తులు మార్పును గమనించి సహకరించాల్సిందిగా మనవి

భక్తులు మార్పును గమనించి సహకరించాల్సిందిగా మనవి

 తిరుమల, జూలై 04, 2011: తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ నిత్యాన్నధాన భవనమునకు అవసరమైన గ్యాస్‌ సరఫరానిమిత్తం గ్యాస్‌ పైపులను అమర్చుతుండం వలన లడ్డుల ఉత్పత్తి కొంత మేరకు తగ్గించాల్సిన అవసరం ఏర్పడింది.

ఈ కారణంగా శ్రీవారి దర్శనానంతరం భక్తులకు ఇస్తున్న అదనపు లడ్డుల సంఖ్య ప్రతిరోజూ ఇచ్చే విధంగా కాకుండా వాటి సంఖ్య కొంత తగ్గించి ఇవ్వాల్సి ఉంటుంది. ఈ తగ్గింపు కేవలం జూలై 4,5 తేదీలలో రెండు రోజులు మాత్రమే ఉంటుంది.

కనుక భక్తులు ఈ మార్పును గమనించి సహకరించాల్సిందిగా మనవి చేస్తున్నాము.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.