AYODHYA RAM MANDIR TRUST SEEKS TTD’S TECHNICAL SUPPORT IN Q MANAGEMENT _ భక్తుల రద్దీ క్రమబద్ధీకరణపై అయోధ్య ట్రస్టు ప్రతినిధులకు అవగాహన కల్పించిన టీటీడీ అధికారులు

Tirumala, 17 February 2024: The officials of TTD informed the representatives of Ayodhya Ram Mandir Trust about the regularization of devotee traffic, queue line management system etc.

The officials team led by TTD EO Sri AV Dharma Reddy in a high-level meeting in the Conference Hall on Saturday evening gave awareness to the representatives of Sri Rama Janmabhoomi Theerthakshetra Trust in Ayodhya about the regulation of devotees’ influx and the management of queue lines.

TTD officials reached Ayodhya on Saturday as per the invitation of the trust.  On this occasion, the TTD EO was asked about the kind of arrangements that should be made to provide a satisfactory darshan to the devotees coming to the temple of Sri Bala Ram. 

TTD engineering officials have made several suggestions regarding the management of Q lines.

Later, the TTD officials were given darshan of the Lord Balarama and presented with offerings.

Representatives of Ayodhya Trust Dr Anil Mishra, Mr Gopal G, Mr Jagadish Offley, Mr Girish Sahasra Bhojani, Mr Raghavulu, National Secretary of Vishwa Hindu Parishad, Mr DSN Murthy, Technical Adviser of TTD Mr G. Ramachandra Reddy, SE-2 Mr. Jagadishwar Reddy, Deputy EEs.  Shri Babu, Shri Nagaraj and others participated.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

భక్తుల రద్దీ క్రమబద్ధీకరణపై అయోధ్య ట్రస్టు ప్రతినిధులకు అవగాహన కల్పించిన టీటీడీ అధికారులు

తిరుమల, 17 ఫిబ్రవరి 2024: భక్తుల రద్దీ క్రమబద్ధీకరణతోపాటు క్యూలైన్ల నిర్వహణ తదితర అంశాలపై అయోధ్యలోని శ్రీ రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు ప్రతినిధులకు టీటీడీ ఈవో శ్రీ ఏవి.ధర్మారెడ్డి నేతృత్వంలోని అధికారులు అవగాహన కల్పించారు.

ట్రస్టు ఆహ్వానం మేరకు టీటీడీ అధికారులు శనివారం అయోధ్యకు చేరుకున్నారు. ట్రస్టు కార్యాలయంలో ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బాలరాముని ఆలయానికి వచ్చే భక్తులకు సంతృప్తికరంగా దర్శనం కల్పించేందుకు ఎలాంటి ఏర్పాట్లు చేపట్టాలనే విషయాలను టీటీడీ ఈవోను అడిగి తెలుసుకున్నారు. క్యూలైన్ల నిర్వహణకు సంబంధించి టీటీడీ ఇంజినీరింగ్ అధికారులు పలు సూచనలు చేశారు.

అనంతరం టీటీడీ అధికారులకు స్వామివారి దర్శనం కల్పించి తీర్థప్రసాదాలు అందజేశారు.

ఈ కార్యక్రమంలో అయోధ్య ట్రస్ట్ ప్రతినిధులు డాక్టర్ అనిల్ మిశ్రా, శ్రీ గోపాల్ జి, శ్రీ జగదీష్ ఆఫ్లే, శ్రీ గిరీష్ సహస్ర భోజని, విశ్వహిందూ పరిషత్ జాతీయ కార్యదర్శి శ్రీ రాఘవులు, శ్రీ డిఎస్ఎన్ మూర్తి, టీటీడీ సాంకేతిక సలహాదారు శ్రీ జి.రామచంద్రారెడ్డి, ఎస్ఇ-2 శ్రీ జగదీశ్వర్ రెడ్డి, డెప్యూటీ ఇఇలు శ్రీ బాబు, శ్రీ నాగరాజ్ తదితరులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.