SPREAD BHAJAN CULTURE IN REOMOTE AREAS- TTD CHAIRMAN _ భజన మండళ్ల సభ్యులు గ్రామస్థాయిలో భజన సంస్కృతిని విస్తృతంగా ప్రచారం చేయాలి :  టీటీడీ ఛైర్మన్ శ్రీ వై. వి.సుబ్బా రెడ్డి

Tirupati, 9 January 2020: TTD chairman Sri YV Subba Reddy exhorted the members of bhajan mandals of Dasa Sahitya Project to propagate the bhajan culture in villages and promote sanatana Hindu dharma.

Participating in the annual Trimasika metlotsavam celebrations at the third choultry on Thursday evening the Chairman said TTD would extend full support to the Dasa Sahitya project in view of the discipline, skills of bhajan mandal members.

Later he unveiled four CDs of Saint Poet Purandara Dasa on the occasion.

Dasa Sahitya Project Special Officer Sri Anandathirthacharyulu, SV Higher Vedic Studies institute OSD Dr Vibhishana Sharma and nearly 3000 bhajan mandal members from AP Telangana, Tamil Nadu, Kerala and Maharashtra participated.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

భజన మండళ్ల సభ్యులు గ్రామస్థాయిలో భజన సంస్కృతిని విస్తృతంగా ప్రచారం చేయాలి: టీటీడీ ఛైర్మన్ శ్రీ వై. వి.సుబ్బా రెడ్డి  
 
తిరుపతి, 2020 జనవరి 09: సనాతన హైందవ ధర్మ ప్రచారంలో భాగంగా దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో గల భజన మండళ్ల సభ్యులు గ్రామ స్థాయిలో యువతలో భజన సంస్కృతిని మరింత పెంచాలని టీటీడీ ఛైర్మన్ శ్రీ వై. వి.సుబ్బా రెడ్డి   పిలుపునిచ్చారు. టిటిడి దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో తలపెట్టిన శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవ సంబరాలు  గురువారం తిరుపతిలోని రైల్వేస్టేషన్‌ వెనక వైపు గల మూడో సత్ర ప్రాంగణంలో ఘనంగా జరిగాయి.
 
ఈ సందర్భంగా ఛైర్మన్ మాట్లాడుతూ  దాససాహిత్య ప్రాజెక్టులోని భజన మండళ్ల సభ్యులు క్రమశిక్షణ, నైపుణ్యం కలిగి వున్నట్లు అభినందించారు.  దాససాహిత్య ప్రాజెక్టు బలోపేతానికి, మెట్లోత్సవం వంటి కార్యక్రమాలు నిర్వహించేందుకు టిటిడి తన వంతు సహకారాని అందిస్తుందని తెలియజేశారు. 
 
శ్రీవారి అనుగ్రహంతో ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుపతిలో శ్రీవారి మెట్లోత్సవం నిర్విగ్నంగా జరుగుతుందని తెలియజేశారు. మానవులు జ్ఞాన పూర్వకంగా, శ్రద్ధతో, యోగ్యతానుసారంగా పని చేయాలని, శ్రేయో మార్గమైన ఇలాంటి అంశాలను అలవరుచుకుంటే జీవనం సుఖమయం అవుతుందని అన్నారు. 
 
అనంతరం పురందాస్ కీర్తనలకు సంబందించిన 4 సి.డి.లను 
ఆవిష్కరించారు. ఇందులో తత్వ సువలి, జయతు కోదండ రామ, ఉదయం రాగ,  స్మరిసిడవరను కావ్య వున్నాయి.
 
ఈ కార్యక్రమంలో దాస సాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి  శ్రీ ఆనందతీర్థాచార్యులు, ఎస్.వి.ఉన్నత వేద అధ్యయన సంస్థ ప్రత్యేకాధికారి శ్రీ విభీషణ శర్మ, ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుండి 3 వేల మందికిపైగా భజనమండళ్ల సభ్యులు పాల్గొన్నారు.
 
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.