VENGAMAMBA LITERARY FETE _ భవితరాలకు ఎనలేని సాహిత్య సంపాదను అందించిన తరిగొండ వెంగమాంబ : జేఈఓ శ్రీమతి గౌతమి

TIRUPATI, 21 MAY 2024: In connection with the 294th Jayanti of Matrusri Tarigonda Vengamamba, the literary sessions commenced at Annamacharya Kalamandiram in Tirupati on Tuesday.

Speaking on the occasion TTD JEO(H&E) Smt Goutami said TTD has set up the Tarigonda Vengamamba Project and popularised her great literary works. Even today Mutyala Harati is rendered to Tirumala Sri Venkateswara Swamy during Ekanta Seva in the dedication of Tarigonda Vengamamba, she added.

SK University former VC Prof Kusuma Kumari said, Vengamamba stood as a symbol of women empowerment fighting against the social evils that existed in those days. She has penned many great works that were brought to the limelight by TTD.

SVBC Chairman Dr Saikrishna Yachendra spoke on Tarigonda Vengamamba Jeevana Ganam while scholar from Nellore Prachina Visishta Adhyayana Kendram Dr Lokeswari given speech on Vengamamba Sahityam Pratyekata.

Later Annamacharya Project Director Dr Vibhishana Sharma also spoke.

In the evening Smt Srinidhi and team from Hyderabad will present Sankeertans.

Locals participated in this program.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

భవితరాలకు ఎనలేని సాహిత్య సంపాదను అందించిన తరిగొండ వెంగమాంబ : జేఈఓ శ్రీమతి గౌతమి

– తరిగొండ వెంగమాంబ 294వ జ‌యంతి ఉత్సవాలు ప్రారంభం

తిరుపతి, 2024 మే 21: తరిగొండ వెంగమాంబ తన రచనల ద్వారా భావితరాలకు ఎనలేని సాహిత్య సంపదను అందించిందని జేఈఓ శ్రీమతి గౌతమి ఉద్గాటించారు. శ్రీవారి అపర భక్తురాలైన భక్త కవయిత్రి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ 294వ జ‌యంతి ఉత్సవాలు మంగ‌ళ‌వారం తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో ఘ‌నంగా ప్రారంభ‌మ‌య్యాయి.

ఈ సందర్భంగా జేఈవో మాట్లాడుతూ, తరిగొండ వెంగమాంబ శ్రీవారిపై భక్తి శ్రద్ధలతో అనేక సంకీర్తనలు రచించారన్నారు. వెంగమాంబ సాహిత్యాన్ని, రచనలు, కీర్తనలను జన బాహుళ్యంలోకి తీసుకెళ్లేందుకు టీటీడీ కృషి చేస్తోందన్నారు. ముత్యాల హారతి రూపంలో శ్రీ‌వారిలో ఐక్యమైనారన్నారు.

అనంత‌రం జ‌రిగిన సాహితీ సదస్సుకు అధ్యక్షత వహించిన అనంతపురం ఎస్‌కె వర్సిటీ మాజీ ఉపకులపతి డా.కుసుమకుమారి మాట్లాడుతూ, వెంగమాంబ ఎన్నో రచనలు చేసినా ఆమె రచనలకు గుర్తింపు రాలేదన్నారు. టీటీడీ త‌రిగొండ వెంగమాంబ ప్రాజెక్టు ఏర్పాటు చేసి ఆమె సాహిత్యాన్ని, ర‌చ‌న‌ల‌ను వెలుగులోకి తీసుకొని వచ్చిందని చెప్పారు. సంఘసంస్కర్తగా, భక్తిని ఆయుధంగా చేసుకొని ఎన్నో రచనలు చేశార‌ని వివ‌రించారు.

శ్రీ వేంకటేశ్వ‌ర‌ భక్తి ఛానల్ ఛైర్మన్ డా. సాయికృష్ణ యాచేంద్ర “తరిగొండ వెంగమాంబ – జీవ‌న గానం ” అనే అంశంపై మాట్లాడుతూ, అన్ని వర్గాల ప్రజలు అర్థం చేసుకునేందుకు వీలుగా జనరంజకమైన భాషలో వెంగమాంబ రచనలు చేశారని తెలిపారు. వెంగమాంబ పాటలు సామాన్య జనులు పాడుకునే విధంగా వుంటాయన్నారు. ప్రతి పాటలో భక్తి మరియు చైతన్య వంతమైన భావాలు కనిపిస్తాయన్నారు.

నెల్లూరుకు చెందిన‌ ప్రాచీన విశిష్ఠ అధ్యయన కేంద్రం డా. లోకేశ్వరి “తరిగొండ వెంగమాంబ – సాహిత్యం – ప్రత్యేకత” అనే అంశంపై ప్ర‌సంగిస్తూ, వెంగమాంబ సాహిత్యంలో భక్తి అనేది ప్రత్యేకంగా కనిపింస్తుందన్నారు. మానవ జీవిత లక్ష్యం పరమాత్మ సాక్షాత్కారమని తెలిపారు. వెంగమాంబ రచనల్లో ప్రాచీన సాహిత్యం, ఆనాటి సామాజిక, భాషా, సాంస్కృతిక విశేషాలు తెలుసుకోవచ్చన్నారు. రచనలలో సకల సిద్ధాంతాలను ఆకళింపు చేసుకుని తాత్వికతను లోకానికి అందించినట్లు వివరించారు.

అన్నమాచార్య ప్రాజెక్టు సంచాలకులు డా. ఆకెళ్ళ విభీషణ శర్మ “తరిగొండ వెంగమాంబ – ర‌చ‌న‌ల‌లో వైవిద్యం ” అనే అంశంపై మాట్లాడుతూ, వెంగమాంబ ద్విపద రచనలు, యక్షగానాలు, పద్యాలు, పాటలు వంటి విభిన్న ప్రక్రియలు రాసి అందరి మన్నలలు పొందారన్నారు. వెంగమాంబ మొత్తం 18 రచనలు చేయగా, ఇందులో శ్రీ వేంకటాచల మహత్యం గ్రంథం చిరస్థాయిగా నిలిచిపోయిందన్నారు.

అంతకుముందు శ్రీవారు, తరిగొండ వెంగమాంబ చిత్రపటాలకు పూజలు నిర్వహించారు. అనంతరం త‌రిగొండ వంశీయులు శ్రీ విష్ణుమూర్తి, శ్రీ నాగ‌రాజురావు, సాహితీ సదస్సులో పాల్గొన్న పండితులను శాలువ, శ్రీవారి ప్రసాదాలతో సన్మానించారు.

సాయంత్రం 6 నుండి 8 గంటల వ‌ర‌కు ఎస్వీబిసి ఛైర్మన్ డా. సాయికృష్ణ యాచేంద్ర, హైద‌రాబాద్‌కు చెందిన శ్రీ‌మ‌తి శ్రీ‌నిధి బృందం గాత్ర సంగీత సభ నిర్వ‌హించ‌నున్నారు.

ఈ కార్యక్రమంలో శ్వేత సంచాలకులు శ్రీ భూమన్ సుబ్రహ్మణ్యం రెడ్డి, పుర ప్ర‌జ‌లు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.